
సత్వరమే సమస్యలు పరిష్కరించాలి
● అదనపు కలెక్టర్ అనిల్ కుమార్
పెద్దవంగర: ప్రజలు అందించే అర్జీలపై తక్షణమే స్పందించి, సమస్యలు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షలో తహసీల్దార్ మహేందర్ వివరాలిచ్చారు. మండల వ్యాప్తంగా 1029 దరఖాస్తులు వచ్చాయని, అందులో సాదాబైనామా మినహా వివిధ కేటగి రీలలో 191 భూ సమస్యలు పరిశీలించినట్లు తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడారు. భూభారతిలో వచ్చిన ప్రతీదరఖాస్తును ప్రాధాన్యతగా తీసుకొని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. భూ సంబంధిత పాత సమస్యలపై మరింత వేగంగా స్పందించాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ లష్కర్, జూని యర్ అసిస్టెంట్ల్ పర్వీనా, అయ్యప్పరెడ్డి, రోహి త్ రాజు, రికార్డు అసిసెంట్లు అశోక్, పాషా, తరుణి, స్వరూప తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తులను పరిష్కరించాలి
తొర్రూరు: రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన భూభారతి దరఖాస్తులను వేగవంతంగా పరి ష్కరించాలని అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ అన్నారు. బుధవారం డివిజన్ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. భూ భారతి దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, డీటీ నర్సయ్య, ఆర్‌ఐ నజీముద్ధీన్, సిబ్బంది పాల్గొన్నారు.
జాతీయ స్థాయి క్రీడల్లో
విద్యార్థుల ప్రతిభ
తొర్రూరు: జాతీయ స్థాయి క్రీడల్లో స్థానిక మైనార్టీ బాలికల గురుకులం విద్యార్థులు సత్తా చాటారు. ఇటీవల ఢిల్లీ, మధ్యప్రదేశ్, నల్లగొండలో జాతీయ స్థాయి హాకీ, షూటింగ్‌బాల్, గాట్క క్రీడలు నిర్వహించారు. ఎస్‌జీఎఫ్‌ఐ అండర్–17 విభాగంలో పాఠశాలకు చెందిన బి.నందిని (హాకీ), ఎం.నందిని, డి.అక్షయ, బి.దీక్ష(షూటింగ్‌బాల్), జి.పల్లవి, ఎండీ సమ్రీన్(గాట్క) పాల్గొని ప్రతిభ కనబర్చారు. ఈమేరకు హైదరాబాద్‌లోని జింఖానా మైదా నంలో నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులను మైనార్టీ గురుకులాల ఉపాధ్యక్షుడు పహీముద్దీన్ ఖురేషీ, సెక్రటరీ షఫీ ఉల్లా సత్కరించారు. బుధవారం డివిజన్ కేంద్రంలోని పాఠశాలలో ప్రిన్సిపాల్ పసునూరి వనజ విద్యార్థులను, వ్యాయామ ఉపాధ్యాయులు ఉమ, కల్యాణిని అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల కోఆర్డినేటర్లు నజియా తహసీన్, నుస్రత్ కౌసర్, సునీత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బోనాల పండుగ
ప్రశాంతంగా జరుపుకోవాలి
తొర్రూరు: బోనాల పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి కోరారు. డివిజన్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం పట్టణంలో బోనాల పండుగ నిర్వహణపై చర్చించారు. పురోహితులు ఓలేటి యాదగిరి ఆచార్యులు, స్థానిక నాయకులు చర్చించి ఆగస్టు 6న తొర్రూరులో బోనాల పండుగ జరుపుకోవాలని నిర్ణయించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బోనాల పండగ తెలంగాణ సంస్కృతికి నిదర్శనమని, స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పండుగ జరుపుతామన్నారు. భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నా రు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు, పెదగాని సోమయ్య, ధరావత్ రాజేష్‌నాయక్, మంగళపల్లి రామచంద్రయ్య, చాపల బాపురెడ్డి, సుంచు సంతోష్, సోమ రాజశేఖర్, గుండాల నర్స య్య, సురేందర్‌రెడ్డి, దొంగరి శంకర్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

సత్వరమే సమస్యలు పరిష్కరించాలి

సత్వరమే సమస్యలు పరిష్కరించాలి