
కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ ఆపాలి
● హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్
చంద్రకుమార్
నెహ్రూసెంటర్ : కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీ, గిరిజనులపై కొనసాగిస్తున్న దా డులు, హత్యాకాండను వెంటనే నిలిపివేయాలని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం ఏఐకేఎంఎస్, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హైకోర్టు రిటై ర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షురాలు టాన్యా మాట్లాడుతూ.. అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు మధ్య భారతంలో మారణహోమం సృష్టిస్తున్నారని ఆరోపించారు. అటవీప్రాంతంలోని ఆది వాసీలపై జరుగుతున్న దాడులు, హత్యలపై సు ప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలను ప్రశ్నించిన వారిని నిర్బంధిస్తూ, నక్సలైట్లుగా ముద్రవేసి ఆదివాసీ జాతి హననానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్య క్తం చేశారు. పరిశ్రమలు, పర్యాటక ప్రాంతాల పేరుతో అడవులను కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని వివరించారు. పీసాచట్టం–2006 అమలు చే యాలని, ఆదివాసీల జీవించే హక్కు, భూమి హ క్కును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సదస్సులో ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు ప్రసాద్, మదార్, సాయిలు, కొటమ్మ, వెంకటేశ్వర్లు, పొమ్మన్న, ఆనంద్, కె.భాస్కర్‌రెడ్డి, జీవన్, రాంచందర్, ఉపేందర్, రాంసింగ్, సురేందర్, ఉమ, అశోక్, ఐలయ్య, కృష్ణ, గౌడయ్య, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.