
సోమేశ్వరాలయంలో హైకోర్టు జడ్జి పూజలు
పాలకుర్తి టౌన్: సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జూలకంటి అనిల్‌కుమార్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ చరిత్రను అడిగి తెలుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తికి అర్చకులు స్వామి వారి శేషవస్తాలతో సన్మానించి, స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జస్టిస్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. బసవ పురాణం గ్రంథకర్త పాల్కురికి సోమనాథుడు జన్మించిన ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. కార్యక్రమంలో హైకోర్టు రిజిస్ట్రార్ రవీంద్రశర్మ, అడిషన్ జడ్జి సందీప, ఆర్డీఓ డీఎస్ వెంకన్న, ఏసీపీ అంబటి నర్సయ్య, తహసీల్దార్ నాగేశ్వరచారి, ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, అర్చకులు డీవీఆర్ శర్మ, అనిల్‌కుమర్, నాగరాజు, సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్సై పవన్‌కుమార్ పాల్గొన్నారు.