ఇసుక పంచాయితీ..!
శనివారం శ్రీ 19 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– IIలోu
సాక్షి, మహబూబాబాద్: ఇసుక అక్రమ రవాణా అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులకు ఇబ్బ ందికరంగా మారింది. ఇసుక రవాణా అడ్డుకోవడం, పరిరక్షణ ఎవరి పరిధిలోకి వస్తుందనేది తేలడం లేదు. రెండు నెలలు కట్టుదిట్టం చేసిన అధికారులు ఒక్కసారిగా చేతులెత్తేశారు. దీంతో విచ్చలవిడిగా ఇసుక తరలింపుపై గ్రామాల్లోని రాజకీయ పార్టీల మధ్య మొదలైన చిచ్చు.. ప్రభుత్వ విప్ వరకు వెళ్లింది. దీనిపై ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం, దానిపై జిల్లా తహసీల్దార్ల సంఘం, రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఖండించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కట్టడి చేసేది ఎవరు..
జిల్లా వ్యాప్తంగా నెల్లికుదురు, నర్సింహులపేట, దంతాలపల్లి, మరిపెడ, చిన్నగూడూరు మండలాల పరిధిలో ఉన్న ఆకేరు, మున్నేరు, పాలేరు వాగుల్లోని ఇసుకపై ఎవరికి అజమాయిషీ ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో ఒక్కసారిగా అందరూ అప్రమత్తమయ్యారు. వాగుల వెంబడి టెంట్లు వేసుకొని పహారా కాసిన పోలీస్ శాఖ చేతులెత్తేసింది. దీంతో అడ్డూ అదుపు లేకుండా వాగుల్లోంచి వందల ట్రాక్టర్ల ఇసుక తరలిపోతుంది. అయినా పోలీసు, మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు పట్టించుకోవడం లేదు. అయితే సాండ్ కమిటీ నివేదిక ప్రకారం జిల్లాలోని వాగుల్లో ఇసుక ఉన్నది వాస్తవమే.. కానీ, రీచ్‌లు చేసి విక్రయాలు జరిపే స్థాయి కాదని నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఎవరూ పట్టించుకోవడం లేదనే చర్చ జరుగుతుంది.
ప్రయత్నం విఫలం
గతంలో ఇక్కడ కలెక్టర్‌గా పనిచేసిన శశాంక ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవడం, ఇసుక ద్వారా గ్రామ పంచాయతీలకు ఆదాయం వచ్చే మార్గాలు అన్వేషించారు. ఇందుకోసం ఎక్కడెక్కడ ఇసుక ఉంది. ఎంత మోతాదుల్లో ఉంది. ఎంత ఆదాయం వస్తుంది. ఎలా విక్రయించాలనే విషయంపై అధికారులతో చర్చించారు. ఏమైందో ఏమో.. ఒక్కసారిగా తన నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఇందుకు రాజకీయ నాయకుల ఒత్తిడే కారణమని అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి.
చిచ్చు రేపుతున్న ఇసుక దందా
ఇసుక దందా ఇప్పుడు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నాయకుల్లో గొడవలకు దారితీస్తుంది. గతంలో ఇసుక లభ్యమయ్యే ప్రాంతాల్లో అప్పటి నాయకుల అనుచరులే ఇసుక రవాణా చేసేవారనే ప్రచారం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ప్రస్తుత ప్రభుత్వంలోని కొందరు నాయకులు తమ అనుచరులకు ఇసుక అనుమతులు ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. దీనికితోడు స్థానికులు తమ అవసరాలకు లేకుండా ఇసు క తవ్వకాలు చేస్తుంటే ఎవరూ పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. దీనిపై స్పందించిన విప్ రాంచంద్రు నాయక్ చిన్నగూడూరు సభలో తహసీల్దార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తమ మనోభా వాలు దెబ్బతిన్నాయని రెవెన్యూ, తహసీల్దార్ల సంఘం నాయకులు ఖండించారు. దీనిపై విప్‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘నా అవసరం కోసం కాదు.. ఇసుక అక్రమ రవాణా అడ్డుకుంటానని ఎన్నికల సమయంలో మాట ఇచ్చాను. అది నిలబెట్టుకోవా ల్సిన అవసరం ఉంది. అధికారులు సహకరించాలి. స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని అనుమతులు ఇవ్వాలని చెప్పాను. ఎవరి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించలేదు’ అని చెప్పారు.
మాట్లాడుతున్న వద్దిరాజు రవిచంద్ర
న్యూస్‌రీల్
నిల్వలు ఉన్నా..
రీచ్‌ల ఏర్పాటుకు లేని అవకాశం
స్థానిక అవసరాలకు గ్రీన్ సిగ్నల్
అనుమతులపై చర్చ
ఇసుక రవాణాపై గ్రామాల్లో
రాజకీయ గొడవలు
‘ఇంతకన్న పెద్దమాట ఏం చెప్పాలి. ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌజ్‌లో ఎస్పీని, తహసీల్దార్లను కూర్చొబెట్టి చెప్పాను. మీకు నాకు గెట్టు పంచాయితీ ఉందా.. ప్రజలకు అందకుండా రూ.6 వేలు, రూ.8 వేలకు ట్రాక్టర్ ఇసుక అమ్ముతున్నారు.. గతంలో మాదిరిగా టోకెన్ ఇస్తే ఇలా ఉండదు.. ఈడియట్ మాటలు మాట్లాడకుండా.. కలెక్టర్ వద్ద కూర్చొని మా ఎమ్మెల్యే చెప్పిండని ఆర్డర్ తెచ్చుకోండి.. నేను కేబినెట్ ర్యాంకులో ఉండి చెబుతున్నా పట్టించుకోవడం లేదు.. ఇది సరికాదు.. మేం మా పని చేసుడే సరిపోతుందని చెబితే ఎలా.. ఇక్కడ ఇసుక అయిపోతే ట్రాక్టర్ గోదావరి ఇసుక రూ.10 వేలకు తెచ్చుకోవాలి.’అని
డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌రాంచంద్రునాయక్ చిన్నగూడూరు తహసీల్ధార్
మహబూబ్ అలీతో అన్నమాటలు..
‘చిన్నగూడూరు తహసీల్దార్‌పై డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఇసుక తవ్వకాలకోసం అనుమతి ఇవ్వాలంటే జీఓ నంబర్ 03, 15 ప్రకారం సాండ్ కమిటీ నివేదిక ఉండాలి. అంతే కానీ తహసీల్దార్లకు ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చే అధికారం లేదు. ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవడంలో అన్ని శాఖల సమష్టి కృషి అవసరం. ప్రస్తుత పరిస్థితిలో క్షేత్రస్థాయి సిబ్బంది లేక ప్రభుత్వం నిర్దేశించిన అభివృద్ధి పథకాల అమలుకే సమయం సరిపోకపోయినా కష్టపడి లక్ష్యాలను చేరుకుంటున్నాం. ఈ పరిస్థితిలో సభా ముఖంగా రెవెన్యూ ఉద్యోగులపై ప్రభుత్వ విప్ అనుచితవ్యాఖ్యలు చేయడంతో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇది సరికాదు. విప్ ఇటువంటి సంఘటనలు మరోసారి పునరా వృతం కాకుండా చూసుకోవాలి.’
–జిల్లా రెవెన్యూ, తహసీల్దార్ల సంఘం
ఇసుక పంచాయితీ..!
ఇసుక పంచాయితీ..!


