సెలవులు ఇవ్వకముందే ఇంటిబాట
మహబూబాబాద్ అర్బన్: వేసవి సెలవులు ఇవ్వకముం దే కొంతమంది హాస్టల్ వార్డెన్లు విద్యార్థులను ఇంటికి పంపుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ప్ర భుత్వ, ప్రైవేట్ పాఠశాల, గిరిజన ఆశ్రమ పాఠశా ల, వివిధ గురుకుల పాఠశాలలో 1 నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ నెల 9 నుంచి 17వ తే దీ వరకు వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్ర మంలో వార్షిక పరీక్షలు ముగిశాయని గిరిజన ఆ శ్రమ పాఠశాల హాస్టల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నారు. ఈ నెల 17వ తేదీ వరకు పరీక్షలు ముసిగిన తర్వాత ఈ నెల 23వ తేదీ వరకు విద్యార్థుల త ల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి ప్రొగ్రెస్ కా ర్డులు అందజేసి పంపించాలి. కానీ ముత్యాలమ్మగూడెం, మానుకోట జిల్లా కేంద్రంలోని ఆర్డీ కార్యాలయం ఎదురుగా ఉన్న గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల హాస్టల్స్ ప్రభుత్వ నింబంధనలు పాటించకుండా వార్డెన్లు విద్యార్థులను సెలవులు వచ్చాయని ఇంటికి వెళ్లిపోవాలని సెలవు పత్రాలు రా యించుకుని పంపిస్తున్నారు. కొంత మంది వార్డెన్లు విద్యార్థుల బారం మోయలేమని, గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు, వార్డెన్లు మీ పిల్లలను ఇంటికి తీసుకెళ్లాలని ఫోన్లు చేస్తున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పటికై న హాస్టల్స్ వార్డెన్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నిబంధనలను పాటించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. దీనిపై గిరిజన శాఖ అధికారిని వివరణ కోరగా విద్యార్థులు ఇంటికి వెళ్లడానికి అనుమ తి లేదని, ప్రభుత్వం సెలవులు మంజూరు చేసినప్పుడే తల్లిదండ్రులతో ఇంటికి పంపాలన్నారు. లే దంటే వార్డెన్లపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వార్డెన్లు


