హమాలీల సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదు. గతంలో ప్రతి నెలా 5వ తేదీలోపు ఇచ్చే వేతనాలను నెలలు తరబడి పెండింగ్‌లో పెడుతున్నారు. కూలి రేట్లను తక్షణమే పెంచాలన్న డిమాండ్‌తో 29వ తేదీన ఒక్కరోజు సమ్మెకు పిలుపునిచ్చాం. అప్పటికీ స్పందించకపోతే నిరవధిక ఉద్యమాలకు వెళ్తాం. – ఆర్. కృష్ణ, సివిల్ సప్లై హమాలీ
వర్కర్స్ యూనియన్, రాష్ట్ర అధ్యక్షుడు, కర్నూలు
పనిచేసే సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కాళ్లు, చేతులు, నడుము విరగడం ఖాయం. ఇలాంటి వారికి సరైన వైద్యం కోసం ఆ కుటుంబానికి భరించే శక్తి ఉండదు. అంతేగాక ఇంట్లో ఎవరికై నా జ్వరం వచ్చినా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వం స్పందించి ఈఎస్‌ఐ సదుపాయాన్ని కల్పించాలి.
– బజారి, హమాలీ, కర్నూలు
గతంలో క్వింటం ఎత్తి, దించితే రూ.28 ఇచ్చేవారు. ప్రస్తుతం దానిని రూ.45కు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేగాక గతంలో మాదిరిగా ప్రతి నెలా 5వ తేదీలోపు కూలి చెల్లించాలి. తక్కువ వేతనాలతో బతికే మాకు సమయానికి జీతాలు ఇవ్వకపోతే జీవనం గడిచేది ఎలా? కూటమి ప్రభుత్వం మాపై కక్ష కట్టింది. – సోలోమన్‌రాజు, హమాలీ, కర్నూలు


