● సందడి చేసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న
ఓర్వకల్లు: రాక్‌గార్డెన్‌లో ఆదివారం సినిమా సందడి నెలకొంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ సినిమా కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రవిచంద్ర నిర్మాతగా, రాహుల్ సాంకేతి దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రప్మిక మందన్న కథానాయకులుగా నటిస్తున్నారు. రైల్లో ప్రయాణిస్తున్న విలన్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. షూటింగ్‌కు అంతరాయం కలగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు. సినిమా షూటింగ్‌ను తిలకించేందుకు అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇప్పటికే పలు సినిమాల్లో కనిపించిన రాక్‌గార్డెన్‌లో మరోసారి సినిమా సినిమా షూటింగ్‌తో సందడిగా మారింది.


