వానల్లేక పత్తివిత్తనం మొలవలేదు | - | Sakshi
Sakshi News home page

వానల్లేక పత్తివిత్తనం మొలవలేదు

Jun 29 2026 1:53 AM | Updated on Jun 29 2026 1:53 AM

వానల్లేక పత్తివిత్తనం మొలవలేదు వర్షం కోసం ఎదురు చూస్తున్నా

పదిరోజుల కిందట కురిసిన అరకొర వానలకు ఎకరాకు రూ.5 వేల చొప్పున ఖర్చు పెట్టి ఐదెకరాల్లో పత్తి విత్తనాలు నాటా. అయితే ఇంతవరకు చినుకు జాడలేకుండా పోయింది. భూమిలో పదును లేక పత్తి మొలకలు సరిగా రాలేదు. వచ్చిన మొలకలు కూడా వానల్లేక మొలకదశలోనే ఎండిపోతున్నాయి. ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే మునుముందు ఎలాంటి పరిస్థితులను చూడాలో అర్థం కావడం లేదు.

– రాజు, రైతు, గూడూరు

వర్షాధారం కింద ఈ ఏడాది 12 ఎకరాల్లో కంది పంట సాగు చేసేందుకు భూమిని దుక్కి దున్ని సిద్ధం చేసుకున్నా. ప్రతి ఏడాది ఈ సమయానికి వర్షాలు సమృద్ధిగా పడేవి. అయితే ఈ సారి సీజన్‌ ప్రారంభమై మూడువారాలు గడిచినా ఒక్క భారీ వర్షం కూడా లేదు. మరికొద్ది రోజులు ఇలాగే ఉంటే ఖరీఫ్‌ సీజన్‌ పూర్తవుతుంది. పంటలు సాగు చేయలేని పరిస్థితి వస్తుంది.

– మహేశ్వరరెడ్డి, రైతు, వెంకటగిరి గ్రామం,

కోడుమూరు మండలం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement