ప్రభుత్వానికి దళితులపై వివక్ష తగదు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానికి దళితులపై వివక్ష తగదు

Jun 29 2026 1:53 AM | Updated on Jun 29 2026 1:53 AM

శ్రీశైలం ప్రాజెక్టు: రాష్ట్ర ప్రభుత్వం దళిత ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధుల పట్ల వివక్ష చూపడం సరికాదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగుమాల శోభన్‌ బాబు అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఐఏఎస్‌ అధికారి పీవీ సునీల్‌ కుమార్‌ ఈనెల పదవీ విరమణ చేయుచున్న సందర్భంగా ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఐఏఎస్‌ అధికారిని శ్రీలక్ష్మి ఇచ్చిన అవకాశం పీవీ సునీల్‌ కుమార్‌కు ఇచ్చి గౌరవించాలని శోభన్‌ బాబు కోరారు. అలాగే దళిత ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌ కుమార్‌ కారుపై రాళ్లదాడి దారుణమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ విభేదాలు, హింసకు దారి తీయడం అత్యంత దురదృష్టకరమన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement