కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో పంచాయతీరాజ్ ఏఈ, ఏఈఈలుగా విధులు నిర్వహిస్తున్న పది మందికి రెగ్యులర్ డీఈఈలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు పీఆర్ ఈఎన్‌సీ బాలునాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిలో ఇప్పటి వరకు కొందరు ఇన్‌చార్జి డీఈఈలుగా, మరికొందరు ఏఈ, ఏఈఈలుగా విధులు నిర్వహిస్తున్నారు. పదోన్నతి పొందిన వారిలో ఆర్.సతీష్‌కుమార్‌ను కర్నూలు పీఐయు సబ్ డివిజన్‌కు, గూడురు ఏఈఈ నాగరాజును పీఏ టు ఎస్‌ఈ కర్నూలు, రమణారెడ్డిని పీఆర్ క్వాలిటీ కంట్రోల్ డీఈఈగా నియమించారు. అలాగే విజయభాస్కర్‌ను పీలేరు, ఆర్‌ఎల్ ప్రకాష్‌ను పీఐయు పత్తికొండ, వాహీద్‌ను నంద్యాల పీఆర్‌ఐ, వెంకటరెడ్డిని ఆళ్లగడ్డ, ఆయాజ్‌ను ఆత్మకూరు, మన్నధబాబును పీఏ టు ఈఈ నంద్యాల, రమణను పీఐయు, ఆత్మకూరుకు నియమించారు. కర్నూలు పీఆర్ క్వాలిటీ కంట్రోల్ డీఈఈగా పదోన్నతి పొందిన రమణారెడ్డి శనివారం స్థానిక కార్యాలయంలో ఇన్‌చార్జి డీఈఈ భాస్కర్‌రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఈఈ నాగిరెడ్డి, రిటైర్డు డీఈఈ రవీంద్రారెడ్డి, ఏఈఈలు అమర్‌నాథ్, విజయభాస్కర్ తదితరులు రమణారెడ్డికి పూలబొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
‘సీమ’ ప్రాజెక్టులపై
టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు
కర్నూలు (టౌన్): రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల సాధన టాస్క్‌ఫోర్స్ కమిటీని నియమించింది. జిల్లా స్థాయిలో ఈ టాస్క్‌ఫోర్స్ కమిటీలో సభ్యులుగా జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహులు యాదవ్, జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణా రెడ్డిని నియమించారు. అలాగే ఆలూరుకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెర్నెకల్ సురేందర్ రెడ్డిని కోఆర్డినేటర్‌గా నియమించారు. ఈ మేరకు శనివారం రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.
రాయితీపై డ్రిప్, స్ప్రింక్లర్లు
కర్నూలు(అగ్రికల్చర్): డ్రిప్, స్ప్రింక్లర్లను ఉద్యాన శాఖ ఏపీఎంఐపీ ద్వారా రాయితీపై మంజూరు చేస్తోందని జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ కే.శ్రీనివాసులు తెలిపారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఐదు ఎకరాల్లోపు ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, ఇతర అన్ని వర్గాల రైతులకు 10 ఎకరాల వరకు 90 శాతం, 10 ఎకరాలకు పైనున్న రైతులకు 50 శాతం రాయితీ లభిస్తుందన్నారు. అన్ని వర్గాల రైతులకు స్ప్రింక్లర్ల యూనిట్‌ను 50 శాతం రాయి తీపై మంజూరు చేస్తామన్నారు. ఆసక్తి ఉన్న రైతులు రైతు సేవా కేంద్రాలు లేదా వ్యవసాయ, ఉద్యాన అధికారుల ద్వారా పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. సూక్ష్మసేద్యానికి ఆటోమేషన్ పథకాన్ని కూడా అమలు చేస్తున్నామని.. మొబైల్ ద్వారా ఎక్కడి నుంచైనా సూక్ష్మ సేద్యం చేసుకోవచ్చన్నారు.


