అమరావతిలో రైతులపై దాడి అమానుషం | - | Sakshi
Sakshi News home page

అమరావతిలో రైతులపై దాడి అమానుషం

Jun 28 2026 2:56 AM | Updated on Jun 28 2026 2:56 AM

రాష్ట్రంలో లోకేష్‌ రెడ్‌బుక్‌

రాజ్యాంగం నడుస్తోంది

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి

ఆలూరు రూరల్‌: అమరాతిలో రైతులపై టీడీపీ గుండాలు దాడి చేయడం అమానుషమని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. శనివారం సాయంత్రం ఆయన చిప్పగిరిలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో లోకేష్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందన్నారు. రైతుల ఆహ్వానం మేరకే వైఎస్సార్‌సీపీ కమిటీలోని రైతులు అక్కడి వెళ్లారన్నారు. చంద్రబాబు కలల రాజధానిలో రైతులపై దాడి జరిగితే పోలీసులు కళ్లకు గంతులు కట్టుకున్నారని చెప్పారు. రాజధాని ప్రాంత రైతులకు అన్యాయం జరిగితే పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం ఇతర ప్రాంత రైతులకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. అమరావతికి వైఎస్సార్‌సీపీ నాయకులు, రైతులు వస్తే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారన్నారు. అమరావతి పేరుతో భూ సేకరణతో రూ.లక్షల కోట్లు దోచుకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రైతులపై దాడి చేయడం, దుర్మార్గపు చర్యలకు పాల్పడం రాష్ట్రంలో సాధారణంగా మారిందని విమర్శించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement