● మరో ముగ్గురికి గాయాలు
గోస్పాడు: తేళ్లపురి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు దుర్మరణం చెందాడు. తేళ్ల్లపురి గ్రామానికి చెందిన తిరుపతి మస్తానయ్య, బీబీ దంపతులు వారి ఇద్దరి పిల్లలతో మోటార్ బైక్‌పై శుక్రవారం సాయంత్రం కానాలపల్లెకు బయలుదేరారు. అయితే బయలుదేరిన కొద్దిసేపటికే ఎదురుగా వస్తున్న ఇన్నోవా వాహనం బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన దంపతులు మస్తానయ్య, బీబీ, కుమారుడు మొఘల్ షరీఫ్ (13), కుమార్తె అస్మాలను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే షరీఫ్ తీవ్రంగా గాయపడడంతో పరిస్థితి విషమించి మెరుగైన చికిత్స నిమిత్తం శనివారం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. బాలుడి తల్లి బీబీ ఫిర్యాదు వరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుధాకర్ రెడ్డి తెలిపారు.


