జైరాజ్ ఇస్పాత్ సంస్థ ఎండీ ఎస్‌కే గోయెంకా
కర్నూలు (టౌన్): జైరాజ్ ఇస్పాత్ కంపెనీ నుంచి అత్యుత్తమైన ఉక్కును ఉత్పత్తి చేసి ప్రపంచంలోనే కర్నూలుకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకువస్తామని జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్‌కే గోయెంకా అన్నారు. నగరంలోని వెంకటరమణ కాలనీలోని సాయి శక్తి ఏజెన్సీ, నంద్యాల రోడ్డులోని శ్రీ సా యి బిల్డింగ్ మెటీరియల్స్, నందికొట్కూర్ రోడ్డులోని ఆర్థ ట్రేడర్స్‌లలో జైరాజ్ ఎటూట్ ఎఫ్‌ఈ 550డీ టీఎంటీ డీలర్ షిప్‌లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎండీ మాట్లాడుతూ.. ఉక్కు తయారీ కేంద్రంగా ఉక్కు ప్రపంచ పటంలో కర్నూలు నిలిచిపోతుందన్నారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. త్వరలో ఏటా మిలియన్ టన్నుల వృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వైఎస్సార్‌సీపీ మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఉక్కు పారిశ్రామికవేత్త విక్రమ్ సింహా రెడ్డి మాట్లాడుతూ.. కర్నూలు అపారమైన పారిశ్రామిక సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. జిల్లాలో ఒక పెద్ద సమీకృత ఉక్కు తయారీ కేంద్రాన్ని స్థాపించాలన్న జైరాజ్ ఇస్పాత్ నిర్ణయం ఈ ప్రాంతానికే గర్వకారణమన్నారు. జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ డైరెక్టర్ రాజశ్రీజైన్, వైస్ ప్రెసిడెంట్ రమ్య కోడాలి, డీలర్లు, కాంట్రాక్టర్లు, బిల్డర్లు, ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, వ్యాపార భాగస్వాములు పాల్గొన్నారు.


