చిత్రంలో సైకిల్‌పై కనిపిస్తున్న వ్యక్తి పేరు రఘు. స్థానిక కేడీసీసీ బ్యాంక్‌లో దాదాపు 25 ఏళ్లుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతని వయస్సు ఇప్పుడు 50 ఏళ్లు కాగా.. 40 ఏళ్ల క్రితం తన నాన్న కొనిచ్చినా సైకిల్‌ను ఇప్పటికీ ఉపయోగిస్తున్నాడు. ఇతను నివసించే చౌడమ్మ కాలనీలో ఉదయాన్నే ప్రతి ఒక్కరూ అతని సైకిల్ బెల్ చప్పుడు వినాల్సిందే. కుటుంబ అవసరాలకు, బ్యాంకుకు ఇదే సైకిల్‌పైనే వెళ్తున్నాడు. ఓ వైపు సైకిల్ తొక్కుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరో వైపు పెట్రోల్ ఖర్చులు ఆదా చేస్తున్న రఘు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. – పత్తికొండ


