నేడు, రేపు ‘సర్‌’ ప్రత్యేక క్యాంపులు | - | Sakshi
Sakshi News home page

నేడు, రేపు ‘సర్‌’ ప్రత్యేక క్యాంపులు

Jun 27 2026 1:43 AM | Updated on Jun 27 2026 1:43 AM

రేపు పల్స్‌ పోలియో ఇమ్యూనైజేషన్‌

కర్నూలు(సెంట్రల్‌): స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌)లో ఎన్యుమరేషన్‌ ఫాంల పంపిణీలో వెనుకబడిన పోలింగ్‌ బూత్‌ల్లో 27, 28 తేదీల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి సి.వెంకటనారాయణమ్మ శుక్రవారం ఓ ప్రకటనలో ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలను ఆదేశించారు. ఇటీవల ఎన్నికల సంఘం డెప్యూటీ కమిషనర్‌ సర్‌ ప్రక్రియపై సమీక్షించారన్నారు. ఆ సందర్భంగా చాలా నియోజవకర్గాల్లో ఎన్యుమరేషన్‌ ఫాంల పంపిణీ, స్వీకరణ నెమ్మదిగా సాగుతున్నట్లు గుర్తించారన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు శని, ఆదివారాల్లో జిల్లాలోని అన్ని పోలింగ్‌ బూత్‌ల్లో ప్రత్యేక క్యాంపులను తప్పనిసరిగా నిర్వహించాలన్నారు.

ఏడు మండలాల్లో

తేలికపాటి వర్షాలు

కర్నూలు(అగ్రికల్చర్‌): ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తేలికపాటికే పరిమితమవుతున్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఏడు మండలాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. హొళగుందలో 7.2 మి.మీ, కల్లూరులో 2.2, ఆదోనిలో 2.2, చిప్పగిరిలో 1.8, కర్నూలు అర్బన్‌లో 1.6, కర్నూలు రూరల్‌లో 1.2, కౌతాళంలో 0.8 మిమీ ప్రకారం వర్షాలు కురిశాయి. కొద్ది రోజులుగా వర్షాలు లేకపోవడంతో ఖరీఫ్‌ నిరాశాజనకంగా మారింది. సబ్సిడీపై పంపిణీ చేసే వేరుశనగ, కంది తదితర విత్తనాలకు డిమాండ్‌ తగ్గిపోయింది. పత్తి విత్తనాలకు సైతం డిమాండ్‌ తగ్గిపోవడం గమనార్హం.

కర్నూలు(సెంట్రల్‌): జిల్లాలో ఈనెల 28న ఆదివారం పల్స్‌ పోలియో ఇమ్యూనైజేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పల్స్‌ పోలియో ఇమ్యూనైజేషన్‌కు సంబంధించిన జిల్లా టాస్కు ఫోర్స్‌ కమిటీ సమావేశాన్ని కలెక్టర్‌ టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ఈనెల 28, 29, 30 తేదీల్లో నిర్వహిస్తామన్నారు. 28న బూత్‌ స్థాయిలో పోలియో చుక్కలు వేస్తారని, ఆ రోజు చుక్కలు వేయించుకొని ఐదేళ్లలోపు పిల్లలకు 29, 30 తేదీల్లో వారి ఇళ్లకే వెళ్లి వేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల్లోపు పిల్లలు 3,52,164 మంది ఉన్నారని, వీరందరికీ పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఇందుకోసం 1,630 పోలియో బూత్‌లు ఏర్పాటు చేశామన్నారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్‌ కోరారు. టెలీ కాన్ఫరెన్స్‌లో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ భాస్కర్‌, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ ఉమాదేవి, మునిసిపల్‌ కమిషనర్‌ చల్లా ఓబులేషు, విద్యుత్‌ ఎస్‌ఈ ప్రదీప్‌కుమార్‌, ఐసీడీఎస్‌ పీడీ విజయ, డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి,మెప్మా పీడీ శ్రీనివాసులు, డీఈఓ సుధాకర్‌, ఆర్‌టీసీ ఆర్‌ఎం శ్రీనివాసులు పాల్గొన్నారు.

మాదక ద్రవ్యాల వినియోగంతో జీవితాలు నాశనం

కర్నూలు: మాదక ద్రవ్యాల వినియోగం జీవితాలను నాశనం చేస్తుందని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ జిల్లా అధికారి ఎం.సుధీర్‌ బాబు హెచ్చరించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎకై ్సజ్‌ కార్యాలయం నుంచి కొండారెడ్డి బురుజు వరకు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. సుధీర్‌ బాబుతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ రాజశేఖర్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో ర్యాలీ సాగింది. ప్రతి ఒక్కరూ ‘సే నో టు డ్రగ్‌, ఎస్‌ టు లైఫ్‌’ అంటూ నినాదాలు చేస్తూ సమాజంపై డ్రగ్స్‌ ప్రభావాన్ని ప్లకార్డుల ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా సుధీర్‌ బాబు మాట్లాడుతూ డ్రగ్స్‌ వినియోగం వల్ల మనిషి ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. వాటిని సేవించడం వల్ల అవయవాలు ఒక్కొక్కటిగా దెబ్బతింటుందన్నారు. యువకు లు డ్రగ్స్‌ జోలికి వెళ్లరాదని సూచించారు. కార్య క్రమంలో ఎకై ్సజ్‌ సీఐలు చంద్రహాస్‌, రాజేంద్రప్రసాద్‌, జయరాం నాయుడు, కిషోర్‌, ఎస్‌ఐలు దుర్గా నవీన్‌ బాబు, రెహనా, వెంకటరాజు, రవితేజ, మారుతి ప్రసాద్‌తో పాటు ఎకై ్సజ్‌ సిబ్బంది, ఈగల్‌ టీమ్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement