వైద్యులు లేక.. 108 రాక.. వృద్ధుడి మృతి | - | Sakshi
Sakshi News home page

వైద్యులు లేక.. 108 రాక.. వృద్ధుడి మృతి

Jun 27 2026 1:43 AM | Updated on Jun 27 2026 1:43 AM

హాలహర్వి: సమయానికి 108 అంబులెన్స్‌ రాక, ఆటోలో అష్టకష్టాలు పడి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ వైద్యులు లేక ఒక వృద్ధుడు మృతి చెందాడు. హాలహర్వి మండలం పచ్చారపల్లి గ్రామానికి చెందిన బోయ లక్ష్మీనారాయణ (74) శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా అందుబాటులో లేదని సమాధానం వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు లక్ష్మీనారాయణను ఒక ఆటోలో పచ్చారపల్లి నుంచి హాలహర్వి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కనీసం ఒక్క డాక్టర్‌ కూడా అందుబాటులోలేరు. డ్యూటీలో ఉండాల్సిన స్టాఫ్‌నర్స్‌ భోజనానికి వెళ్లారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్న సమయంలో ఆలూరు అంబులెన్స్‌ హాలహర్వి ఆసుపత్రికి వచ్చింది. దానిలో బాధితుడిని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సమయం మించిపోవడంతో పరీక్షించిన ఆలూరు వైద్యులు లక్ష్మీనారాయణ మృతిచెందినట్లు నిర్ధారించారు. హాలహర్వి ఆసుపత్రిలో డాక్టర్లు లేక, 108 రాక వృద్ధుడు మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు, బంధువుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement