మూల్యాంకనం పారితోషికం చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

మూల్యాంకనం పారితోషికం చెల్లించాలి

Jun 26 2026 6:22 AM | Updated on Jun 26 2026 6:22 AM

కర్నూలు సిటీ: ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన పది పరీక్షల మూల్యాంకనం పారితోషికాన్ని చెల్లించాలని ఏపీ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు వై.నారాయణ డిమాండ్‌ చేశారు. గురువారం నగరంలోని ప్రధానోపాధ్యాయుల భవన్‌లో ఏర్పాటు చేసిన ఆ సంఘం సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో నిర్వహించబోయే క్లస్టర్‌ సమావేశాలను మండల కేంద్రంలోని ఒకే పాఠశాలలో కాకుండా ఉపాధ్యాయుల సంఖ్యను బట్టి రెండు, మూడు పాఠశాలల్లో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం చేయనున్న పని సర్దుబాటుకు విద్యార్థుల ఎన్‌రోల్‌ను ఈ నెల 23వ తేదీకి కాకుండా జూన్‌ 30వ తేదీ నాటి నుంచి పరిగణలోకి తీసుకోవాలన్నారు. గత నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఉన్నత పాఠశాలల వాచ్‌మెన్‌ల వేతనాలను తక్షణమే విడుదల చేయాలన్నారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు చంద్రశేఖర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి డీసీ హూస్సేన్‌, రాష్ట్ర కౌన్సిలర్‌ ఎం.రమేష్‌, జిల్లా ఉపాధ్యక్షులు పి.రామచంద్రారెడ్డి, హెడ్‌ క్వార్టర్స్‌ కార్యదర్శి పి.అస్లాం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement