ముందుకొస్తున్న మగాళ్లు | - | Sakshi
Sakshi News home page

ముందుకొస్తున్న మగాళ్లు

Jun 26 2026 6:10 AM | Updated on Jun 26 2026 6:10 AM

ఎవరిష్టం వారిది

జిల్లాలో కుటుంబ నియంత్రణ

ఆపరేషన్లు

(కర్నూలు జిల్లా)

2022-23 6,989 1

చిన్న కుటుంబాలే ముద్దు

ఒకప్పుడు మహిళలు మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకునే పరిస్థితి. అప్పట్లో మహిళలు అధిక శాతం ఇంటి పనులు చేసుకునేవారు. ఉద్యోగాల్లో పెద్దగా కనిపించేవారు కాదు. ఈ నేపథ్యంలో మహిళలే అధిక శాతం కు.ని. ఆపరేషన్లకు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. మగవారు కు.ని ఆపరేషన్‌ చేయించుకుంటే వారిలో శక్తి తగ్గిపోతుందని, పనులు చేసుకోలేరని భావించేవారు. ఇప్పుడు అవగాహన పెరగడంతో పురుషులు సైతం కు.ని ఆపరేషన్‌లు చేయించుకుంటున్నారు. 2011 నుంచి 2019 వరకు జిల్లాలో ఒక్క పురుషుడు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌(వేసక్టమి) చేయించుకోని పరిస్థితి. ఆ తర్వాత ఒక్కొక్కరూ తోడవుతూ ప్రస్తుతం 46 మంది ఆపరేషన్‌ చేయించుకునే వరకు వచ్చింది.

కర్నూలు(హాస్పిటల్‌): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒక్కడే కుమారుడు. ఆయన కుమారుడు, విద్యా శాఖ మంత్రి లోకేష్‌కు ఒక్కడే కుమారుడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి, సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు కోట్లాది రూపాయల ఆస్తులు, వ్యాపారాలు ఉన్నప్పటికీ కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక్కో సంతానమే ఉండాలి. అయితే ప్రజలను మాత్రం ఒకరు, ఇద్దరు కాదు.. ఎంత మంది పిల్లలను కంటే అంత డబ్బులు ఇస్తానని చెప్పడం విమర్శలకు తావిస్తోంది. ఒకరిద్దరు పిల్లలను పెంచి పెద్ద చేయడమే భారమవుతున్న రోజుల్లో.. సీఎం, ఆయన కుమారుడు పాటించకుండా ప్రజలను సంతానోత్పత్తి యంత్రాలుగా భావించడం గమనార్హం. అయితే ప్రజలు మాత్రం స్పష్టమైన ముందుచూపు, సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తున్నారనేందుకు ఇటీవలి గణాంకాలే నిదర్శనం.

పెరిగిన కు.ని. ఆపరేషన్లు

దేశంలో 50 ఏళ్ల క్రితం అప్పటి జనాభా పెరుగుదలను గుర్తించిన అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే చాలంటూ విస్తృత ప్రచారం చేయించింది. అప్పట్లో ఏకంగా బలవంతపు కు.ని ఆపరేషన్లు కూడా చేయించారు. అప్పటి నుంచి దేశంలోని ప్రతి జిల్లాకు లక్ష్యాలు నిర్దేశించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తూ వచ్చారు. 15 ఏళ్ల క్రితం వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో 35వేల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని లక్ష్యం విధించేవారు. ఈ మేరకు లక్ష్యాన్ని చేరుకునేందుకు బటన్‌హోల్‌ ఆపరేషన్లను సైతం ప్రోత్సహించారు. ఇందుకోసం బెంగళూరు నుంచి ఓ డాక్టర్‌ను తీసుకొచ్చి ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఆపరేషన్లు చేయించారు. ప్రస్తుతం కర్నూలు, నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాల, ఆదోని ఎంసీహెచ్‌ ఆసుపత్రుల్లోని పీపీ యూనిట్లతో పాటు ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, బేతంచర్ల, డోన్‌, నందికొట్కూరు, గూడూరు, గార్గేయపురం, డోన్‌లలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నారు.

ముఖ్యమంత్రి మాటలపై

ఆగ్రహావేశాలు

రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో అవసరం మేరకు జనాభా లేదని, జనాభా స్థిరీకరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇందుకోసం ఒక్కొక్కరు సంతానాన్ని పెంచాల్సిన అవసరం ఉందని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల కాలంలో పలు కార్యక్రమాల్లో చెబుతూ వస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక పాలసీని సైతం రూపొందించారు. అయితే ముఖ్యమంత్రి మాటలను ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరని తెలుస్తోంది. దీనికితోడు ఈ పాలసీపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. దంపతులు ఎప్పటిలానే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. ఒకరిద్దరు పిల్లలను కని పెంచేందుకే ఆపసోపాలు పడుతుంటే అధిక సంతానం కనాలని ముఖ్యమంత్రి ఎలా చెబుతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

సంతానం విషయంలో ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తాం. ఎవరి ఆర్థిక స్థోమత, వారి సామాజిక పరిస్థితులను బట్టి సంతానం విషయంలో నిర్ణయం తీసుకుంటారు. ఈ మేరకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు వచ్చే వారికి ఆపరేషన్‌ చేయించి పంపిస్తున్నాం. అయితే గతంలో మాదిరిగా కు.ని ఆపరేషన్లకు అధిక లక్ష్యాలు విధించి, వాటిని అధిగమించాలని చెప్పడం లేదు.

–డాక్టర్‌ వై.కామేశ్వరప్రసాద్‌,

డీఎంహెచ్‌వో, కర్నూలు

సంవత్సరం ట్యూబెక్టమి వేసక్టమి

(ఉమ్మడి జిల్లా)

2019-20 16,556 0

2020-21 7,728 1

2021-22 7,575 1

2023-24 8,836 3

2024-25 8,378 2

2025-26 7,906 46

చంద్రబాబు అధిక సంతానం

వ్యాఖ్యలపై అనాసక్తి

ఒకరు లేదా ఇద్దరే చాలంటున్న

జంటలు

అధికమవుతున్న ఖర్చులతో

ఉక్కిరిబిక్కిరి

పెరుగుతున్న కుటుంబ నియంత్రణ

ఆపరేషన్లు

వేసక్టమి ఆపరేషన్లకు

ముందుకొస్తున్న పురుషులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement