జొన్నగిరిలో 5వేల ఉద్యోగాలకు ఎంఓయూ ఇప్పించగలరా? | - | Sakshi
Sakshi News home page

జొన్నగిరిలో 5వేల ఉద్యోగాలకు ఎంఓయూ ఇప్పించగలరా?

Jun 26 2026 6:10 AM | Updated on Jun 26 2026 6:10 AM

గోల్డ్‌ మైనింగ్‌కు అప్పట్లోనే అనుమతులు

కర్నూలు(టౌన్‌): ‘సీఎం చంద్రబాబు జొన్నగిరిలో ప్రారంభించింది రెండో దశ గోల్డ్‌ మైన్‌ ప్రాజెక్టును. ఇక్కడ ఇప్పటికే మొదటి దశ మైనింగ్‌ జరుగుతోంది. అయినా చంద్రబాబే కర్త, కర్మ, క్రియ అన్నట్లుగా చెప్పుకొంటున్నారు. 5 వేల ఉద్యోగాలు వస్తాయని పచ్చి అబద్దాలు చెబుతున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే 5 వేల ఉద్యోగాలు ఇస్తున్నట్లు కంపెనీ యాజమాన్యంతో ఎంఓయూ చేయించగలరా’ అని వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. ఆయన గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 17 ఏల్లు సీఎంగా చంద్రబాబు రాయలసీమ ప్రాంతానికి ఏం ఒరగబెట్టారని, కనీసం ఏ ప్రాజెక్టు అయిన తేవడం కానీ, ఇతర ప్రభుత్వాలు ప్రారంభించిన పనిని పూర్తి చేయడం కానీ చేశారా అని నిలదీశారు. పైగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ. 900 కోట్లు ఖర్చు పెట్టి పోతిరెడ్డిపాడు వద్ద ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడితే.. చంద్రబాబు పక్క రాష్ట్రం తెలంగాణ సీఎం కోసం ఆ పనులను నిలిపివేయడం సీమ ప్రజలను, రైతులను దగా చేయడమేనన్నారు. వైసీపీ గొడ్డలి పార్టీ అని చెబితే ప్రజలు నమ్ముతారని అనుకోవడం బాబు అవివేకమన్నారు. టీడీపీనే పక్కా క్రిమినల్‌ పార్టీ అని చెప్పారు. కుల రాజకీయాలకు ఆద్యుడు పవన్‌ కళ్యాణ్‌ అని చెప్పారు. కాపులకు పౌరుషం లేదా అని కులాలను రెచ్చగొట్టింది పవన్‌ కళ్యాణ్‌ కాదా అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుడికి పోయినా, మసీదుకు పోయినా, చర్చికి పోయినా ఎందుకంత బాధ అని అన్నారు. వైఎస్‌ జగన్‌కు ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారని ఎస్వీ మోహన్‌ రెడ్డి చెప్పారు.

2004లోనే అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జొన్నగిరి గోల్డ్‌ మైనింగ్‌కు నోటిఫికేషన్‌ ఇచ్చారని, 2007లో పనులు ప్రారంభమయ్యాయని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తెలిపారు. 2019లో 1500 ఎకరాలు లీజ్‌కు ఇచ్చారని చెప్పారు. ఈ రోజు అక్కడ పనులు కొత్తగా ప్రారంభించామని చంద్రబాబు చెప్పడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు.

– మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి

సీఎం హోదాలో చంద్రబాబుకు

ఏంచేశారు

పక్కా క్రిమినల్‌ పార్టీ టీడీపీనే

కాపులకు పౌరుషం లేదా అని

రెచ్చగొట్టింది పవన్‌ కళ్యాణ్‌ కాదా?

వైఎస్‌ జగన్‌ గుడికి వెళ్లినా,

మసీదుకు వెళ్లినా ఎందుకంత బాధ?

వైఎస్సార్‌సీపీ నేత ఎస్వీ మోహన్‌ రెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement