ఓటు పాట్లు! | - | Sakshi
Sakshi News home page

ఓటు పాట్లు!

Jun 26 2026 6:10 AM | Updated on Jun 26 2026 6:10 AM

ఓటర్ల వివరాలను చెప్పడమే బీఎల్‌ఓల పని

బీఎల్‌ఓల దగ్గర అందుబాటులో ఓటరు జాబితాలు

కర్నూలు నియోజకవర్గంలోని 89వ బూత్‌కు సంబంధించి ఆన్‌లైన్‌ ద్వారా సెర్చ్‌ చేస్తే 86వ పోలింగ్‌ బూత్‌ ఓటర్ల వివరాలు వస్తున్నాయి. బీఎల్‌ఓ దగ్గర ఓటర్ల వివరాలు ఉంటాయని ఆయనను అడిగితే మా దగ్గర కూడా ఓటర్ల వివరాలు లేని చెప్పడంతో షఫీ అనే ఓటరు కంగుతిన్నారు.

కర్నూలు(సెంట్రల్‌): ప్రస్తుత కల్లూరు అర్బన్‌, రూరల్‌ ప్రాంతాలు 2002లో కర్నూలు నియోజకవర్గంలో ఉన్నాయి. అయితే కర్నూలు ఓటర్లకు సంబంధించి బూత్‌ నంబర్ల వారీగా కర్నూలు అని ఉండడంతో ఆన్‌లైన్‌లో కల్లూరుకు చెందిన ఓటర్ల వివరాలు ఎంత సెర్చ్‌ చేసినా కనిపించని పరిస్థితి. దీంతో ఓటర్లు 2002 జాబితా కోసం ఇబ్బంది పడుతున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోతోంది. తమకేమి తెలియదని, తాము ఎన్యుమరేషన్‌ ఫాం మాత్రమే ఇస్తామని, దానిని పూరించి ఇస్తే ఓటు ఉంటుంది.. లేదంటే ఉండదని బీఎల్‌ఓలు తేల్చి చెబుతుండటం గమనార్హం. కర్నూలు జిల్లాలో మొత్తం 8 నియోజకర్గాలకు సంబంధించి 2,203 పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయి. వీటిలో ప్రతి బూత్‌కు ఒక్కో బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌(బీఎల్‌ఓ)ను నియమించారు. వీరి దగ్గరే ఆయా బూత్‌లకు సంబంధించి 2002, 2025 ఓటరు జాబితాలు ఉంటాయని ఎన్నికల కమిషన్‌(ఈసీ) చెబుతోంది. అయితే బీఎల్‌ఓలు మాత్రం తమ దగ్గర ఆయా ఓటరు జాబితాలు లేవని, ఉన్నా ఎంతమందకని ఇస్తామని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ఓటరు జాబితాలు ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఆయా జాబితాల్లోని ఓటరు వివరాలు మాత్రమే తెలిపినా సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీఎల్‌ఓలు సహకరించకపోవడంతో నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్యుమరేషన్‌ ఫాంతో పాటు 2002, 2025 ఓటరు జాబితాల వివరాలను బీఎల్‌ఓలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.

బీఎల్‌ఓల దగ్గర 2002, 2025 ఓటరు జాబితాలు ఉండాలి. ఎన్యుమరేషన్‌ ఫాంల పంపిణీ సమయంలో ఓటర్లు అడిగితే ఆయా జాబితాల్లోని వారి ఓటు వివరాలను తెలియజేయాలి. ఎక్కడైనా బీఎల్‌ఓలు ఓటర్ల వివరాలను చెప్పకపోతే మాకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. బీఎల్‌ఓల పనే ఓటర్ల వివరాలను చెప్పడం. – సి.వెంకటనారాయణమ్మ, డీఆర్వో

ఎన్యుమరేషన్‌ ఫాం ఇచ్చి

చేతులు దులుపుకుంటున్న వైనం

ఆన్‌లైన్‌ లేదా మీ సేవా కేంద్రాలకు

వెళ్లాలని ఉచిత సలహా

బీఎల్‌ఓల తీరుతో నిరక్షరాస్య ఓటర్లకు

ఇబ్బందులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement