కర్నూలు (టౌన్): ప్రతిష్టాత్మక ఏషియన్ గేమ్స్‌కు కర్నూలు అథ్లెట్ ఎంపికయ్యారు. అండర్–20 విభాగంలో ఈ అరుదైన ఘనత సాధించారు. ఎమ్మిగనూరు తాలూకా నందవరం మండలం హాలహర్వి గ్రామానికి చెందిన మొగలి వెంకటరామి రెడ్డి బెంగళూరు సాయి హాస్టల్‌లో అథ్లెటిక్స్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆల్ ఇండియా స్థాయిలో భువనేశ్వర్‌లో జరిగిన 800 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణపతకం సాధించాడు. వచ్చే సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వ తేదీ వరకు జపాన్ దేశంలోని నగోయా పట్టణంలో జరిగే ఏషియన్ గేమ్స్–2026 క్రీడలకు ఎంపికయ్యారు. కర్నూలుకు చెందిన వెంకటరామిరెడ్డి ఏషియన్‌గేమ్స్ క్రీడలకు ఎంపికకావడం హర్షించదగ్గ విషయమని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ హర్షవర్దన్ పేర్కొన్నారు.


