కర్నూలు (టౌన్): ఈ నెల 28 వ తేదీన కర్నూలులో ఒలింపిక్ డే రన్ నిర్వహించనున్నట్లు ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఒలింపిక్ డేను పురస్కరించుకొని బాస్కెట్‌బాల్, కబడ్డీ, బాక్సింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. అలాగే మాంటిస్సోరి పాఠశాలలో బాక్సింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది వివిధ క్రీడాంశాల్లో పాఠశాలల్లో పోటీలు నిర్వహించి పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేస్తామన్నారు. కాగా కబడ్డీ పోటీలను జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ విజిలెన్స్ సభ్యులు గుడిపల్లి సురేందర్, ఖోఖో పోటీలను హాకీ అసోసియేషన్ ప్రతినిధి దాసరి సుధీర్ ప్రారంభించారు. పోటీల నిహకులు కొండేపి చిన్న సుంకన్న, ప్రతాప్ పాల్గొన్నారు.


