అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

Jun 25 2026 1:24 AM | Updated on Jun 25 2026 1:24 AM

సాక్షి, టాస్క్‌ ఫోర్స్‌: డోన్‌ మండలం వెంకటాపురం గ్రామంలో గొల్ల రాంభూపాల్‌ (38) అనుమానాస్పద మృతి బుధవారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సొంత సోదరుడు టీడీపీ నాయకుడు గొల్ల చంద్రుడుతో ఆయనకు పొలం తగాద ఉన్నట్లు తెలిసింది. ఎనిమిది నెలల క్రితమే మృతుడిపై చంద్రుడు కుటుంబీకులు దాడి చేసినట్లు అప్పట్లో రూరల్‌ పోలీసు స్టేషన్‌లో కేసు సైతం నమోదైంది. వివరాల్లోకి వెళితే.. గొల్ల రాంభూపాల్‌ బుధవారం తెల్లవారు జామున గ్రామ సమీపంలోని వివాదాస్పద పొలం వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. గమనించిన స్థానికులు మృతుడి బంధువులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న రూరల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కర్నూలు నుంచి పోలీసు జాగిలాన్ని రప్పించారు. ఈ జాగిలం పొలం పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతూ నిలబడి పోయింది. చంద్రుడి కుటుంబీకులకు పోలీసులు వంతపాడుతున్నారని, పథకం ప్రకారమే ఈ హత్య జరిగింది అని మృతుడి బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. సాయంత్రం మృతదేహాన్ని తీసుకెళ్లి డోన్‌ పట్టణ పోలీసు స్టేషన్‌ ఎదుట రోడ్డుపై ఉంచి ఆందోళనకు దిగారు.

టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే

టీడీపీ నాయకులు ఓబులాపురం శేషిరెడ్డి, గ్రామ నాయకుడు రామిరెడ్డి ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందని గొల్ల రాంభూపాల్‌ బంధువులు ఆరోపించారు.అన్నదమ్ముల మధ్య నెలకొన్న స్పల్ప వివాదాన్ని వారు పెద్దదిగా చేశారన్నారు. ఆందోళన విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాస్‌ స్వయంగా మృతుడి బంధువుల వద్దకు వచ్చి మాట్లాడారు. నిందితులపై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అనంతరం మృతదేహాన్ని అంత్యక్రియల కోసం గ్రామానికి తరలించారు.

హత్యే అంటున్న బంధువులు

టీడీపీ నాయకుల ప్రోద్బలంతో అన్నే

ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఆరోపణ

న్యాయం కోసం శవంతో

పోలీసు స్టేషన్‌ ఎదుట ధర్నా

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement