వానల్లేక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పంటలు ఎండిముఖం పట్టడంతో బతికించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని కలుగొట్ల గ్రామానికి చెందిన కాంతన్న మూడు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. పది రోజుల క్రితం కురిసిన తొలకరి వర్షాలకు పత్తి విత్తనం నాటాడు. ఆ తర్వాత వానలు ముఖం చాటేయడంతోపాటు నీటి వనరులు లేక పత్తి పంట ఎండిపోసాగింది. దీంతో తీవ్ర వేదనలో మునిగిన తండ్రి బాధను చూడలేని ఆయన కుమారుడు ప్రదీప్ ద్విచక్ర వాహనంపై బిందెలతో నీళ్లు తీసుకొచ్చి జగ్గుతో మూడెకరాల్లోని పత్తి మొక్కలకు పోస్తున్నాడు.
– ఎమ్మిగనూరు సెంట్రల్
జగ్గుతో మొక్కలకు నీరు పోస్తున్న ప్రదీప్


