డోన్: తుగ్గలి మండలం జొన్నగిరిలో గోల్డ్ మైన్స్ ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు రాక సందర్భంగా డోన్ రెవెన్యూ, పోలీస్ అధికారులు దినసరి కూలీలతో ఆర్భాటం చేశారు. కోడుమూరు, కర్నూలు నుంచి పలువురు మహిళలను, యవకులను దినసరి కూలీపై డోన్‌కు తరలించారు. డోన్ అర్బన్ పోలీస్ స్టేషన్ వద్ద గల షాదీఖానాలో వారికి వసతి ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం పలు ప్రైవేట్ వాహనాల్లో వారిని జొన్నగిరికి తరలించారు. వీరికి ప్రతి ఒక్కరికి మైసూర్ గోల్డ్‌మైన్స్ అనే టీ షర్ట్‌లను, టోపీలను ఇచ్చారు. సీఎం కార్యక్రమానికి బౌన్సర్లు(రక్షణగా)గా పని చేయాల్సి ఉంటుందని పోలీస్ అధికారులు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారిలో కొందరు మాట్లాడుతూ....800 వేతనం ఇస్తూ, భోజన వసతి కల్పిస్తామని చెప్పడంతో సీఎం చంద్రబాబు జొన్నగిరిలో పాల్గొనే సభకు తాము బౌన్సర్లుగా వెళ్లామన్నారు.


