ఆస్పరి: హిందూ, ముస్లింలు కలసి కట్టుగా జరపుకునే మొహర్రం పండుగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. హిందువులు కూడా ఈపండుగను సంక్రాంతి, దీపావళి, ఉగాది, దసరాలతో సమానంగా ప్రాధాన్యతనిస్తూ జరుపుకుంటారు. ఆస్పరిలో పెద్ద పీర్లను భక్తిశ్రద్ధలతో అన్ని వర్గాల ప్రజలు కొలుస్తారు. పెద్ద పీర్లకు భక్తులు కానుకనగా ఇచ్చిన వెండి రూపాయి, అర్ధరూపాయి, పావులా, అణాలను గ్రామస్తులు భద్రపరిచారు. వీటిని ప్రతి ఏడాది జరిగే మొహర్రం వేడుకల్లో పెద్ద పీర్లకు అలంకరిస్తారు. చాలా గ్రామాల్లో పీర్లను మోసేటప్పుడు రెండు చేతులు ఉపయోగిస్తారు. ఆస్పరిలో మాత్రం ఊరేగింపుగా తీసుకెళ్లేటప్పుడు ఒకే వ్యక్తి 50 కేజీలు బరువున్న పెద్ద పీర్లను నాలుగు గంటల పాటు ఒంటి చేత్తోనే పీర్లను తీసుకెళ్లడం ప్రత్యేకం.


