కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా పశుగణాభివృద్ధి శాఖ కార్యనిర్వహణాధికారి(డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కె.రాజశేఖర్‌కు జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతి లభించింది. ఈయనను జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ పోస్టు కొన్ని నెలలుగా ఖాళీగా ఉంది. ఇదే పోస్టులో డాక్టర్ రాజశేఖర్ పూర్తి అదనపు బాధ్యతలతో జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా పదోన్నతిపై రెగ్యులర్ జేడీగా నియమితులయ్యారు. ఖాళీ అవుతున్న జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్యనిర్వహణాధికారి పోస్టును డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారితో రెండు, మూడు రోజుల్లో భర్తీ చేయనున్నట్లు సమాచారం.


