ఆర్‌యూ పీజీ సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలు విడుదల | - | Sakshi
Sakshi News home page

ఆర్‌యూ పీజీ సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలు విడుదల

Jun 24 2026 8:28 AM | Updated on Jun 24 2026 8:28 AM

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో మార్చి నెలలో నిర్వహించిన పీజీ మొదటి సెమిస్టర్‌ రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల విభాగం డీన్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.నరసింహులు తెలిపారు. వర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ వి.వెంకట బసరావు ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేశామన్నారు. ఫలితాలు https://rayalaseemauniversity.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని వర్సిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్లు తెలిపారు. రెగ్యులర్‌ పరీక్షలకు సంబంధించి మొదటి సెమిస్టర్‌ పరీక్షలకు 463 మంది హాజరు కాగా 434 మంది ఉత్తీర్ణులయ్యారరు. సప్లిమెంటరీ పరీక్షలకు మొదటి సెమిస్టర్‌ పరీక్షలకు 48 మంది హాజరు కాగా 41 మంది ఉత్తీర్ణులైనట్లు పేర్కొన్నారు.

దేవస్థానం చైర్మన్‌ ఆకస్మిక తనిఖీ

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు రమేష్‌నాయుడు మంగళవారం కల్యాణకట్ట, కౌంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కల్యాణకట్టలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. సిబ్బంది అందరూ కూడా సమయపాలన కచ్చితంగా పాటించాలని సూచించారు. భక్తులతో మర్యాదగా మెలగాలని క్షురకులకు, కౌంటర్‌ సిబ్బందికి సూచించారు. అలాగే భక్తులతో ముఖాముఖిగా మాట్లాడి దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement