పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు | - | Sakshi
Sakshi News home page

పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు

Jun 24 2026 8:28 AM | Updated on Jun 24 2026 8:28 AM

కర్నూలు: పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా జడ్జి కబర్ధి చేతుల మీదుగా లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టంపై ప్రచురించిన వాల్‌ పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కబర్ధి మాట్లాడుతూ ఫోక్సో కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టు ఉందన్నారు. పిల్లలకు ఏదైనా సమస్య వస్తే లీగల్‌ సర్వీసెస్‌ టోల్‌ఫ్రీ 15100కు కాల్‌ చేస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి, ఎకై ్సజ్‌ మెజిస్ట్రేట్‌ అనిల్‌ కుమార్‌, లీగల్‌ సర్వీసెస్‌ యూనిట్‌ మెంబర్‌ డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement