శబరమ్మా... స్క్రిప్ట్‌ చదవొద్దు.. వాస్తవాలు తెలుసుకో! | - | Sakshi
Sakshi News home page

శబరమ్మా... స్క్రిప్ట్‌ చదవొద్దు.. వాస్తవాలు తెలుసుకో!

May 17 2026 1:06 AM | Updated on May 17 2026 1:06 AM

కర్నూలు (టౌన్‌): ‘నంద్యాల ఎంపీ శబరమ్మ ఆడబిడ్డ. కర్నూలుకు పుట్టింటికి వచ్చినట్లు వస్తుంటారు. ఇక్కడి విషయాలు తెలియవు. మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ చదవడం తప్ప వాస్తవాలు తెలియవు’ అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌ రెడ్డి అన్నారు. కర్నూలులోని పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఎస్వీ మాట్లాడారు. ఫార్మా కంపెనీల నుంచి మంత్రి టీజీ భరత్‌ రూ. 45 కోట్లు వసూలు చేశారని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆరోపించారని, ఆధారాలు ఉన్నాయని అంటున్నారని, మంత్రి టీజీ కేసు వేస్తే హైకోర్టులో చూసుకుంటామన్నారు. అయితే ఈ విషయంపై ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, చివరకు రౌడీ షీటర్‌ వరకు మాట్లాడుతున్నారన్నారు. ఎందుకంత ఉలుకు అని ఎస్వీ ప్రశ్నించారు. అమరావతిలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ అవినీతి, అక్రమాలు చేస్తున్నారని, వేల కోట్లు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించినప్పుడు స్పందించని ఈ నాయకులంతా ఒకేసారి బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ‘తప్పు చేశారా.. కప్పి పుచ్చే ప్ర యత్నాలు చేస్తున్నారా..’ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. రెండు రోజుల క్రితం వైఎ స్సార్‌సీపీ నిర్వహించిన ధర్నాలో గంజాయి బ్యాచ్‌, రౌడీలు ఉన్నట్లు చెప్పిన శబరమ్మ అందులో ఒక్కరిపైన అయినా కేసులు చూపించగలవా..మీ అను చరులు మట్కా నిర్వాహకులు అన్న సంగతి తెలి యదా?’ అని ప్రశ్నించారు. పోలీసుల వేధింపులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాలుపై నిరా ధార ఆరోపణలు చేస్తున్న శబరమ్మా.. బాలు గత పదేళ్లు టీజీ వద్దే ఉన్నారన్న విషయం తెలుసా...అప్పుడు లేని ఆరోపణలు ఇప్పుడు మాత్రమే కనిపిస్తున్నాయా.. అని అన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్‌ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులతో ఇబ్బందులు పెడుతున్నారని, వేధిస్తున్నారంటూ కలెక్టరేట్‌ ఎదుట వైఎస్సార్‌సీపీ ధర్నా చేస్తే.. అధికారంలో ఉన్న మీరు ఎస్వీ మోహన్‌ రెడ్డిని, బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని అరెస్టు చేయాలంటూ ధర్నా చేయడం దిగజారుడుతనానికి నిదర్శమన్నారు. మీరే అధికారంలో ఉన్నప్పుడు అరెస్టు చేయ్యలేరా.. ఇవన్నీ డ్రామాలు కాదా.. అని ప్రశ్నించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.

మంత్రి టీజీ అవినీతి, ఆరోపణలపై

ఎందుకంత ఉలుకు?

విలేకరుల సమావేశంలో

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

ఎస్వీ మోహన్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement