బంగారు పల్లకీలో దివ్యతేజం | - | Sakshi
Sakshi News home page

బంగారు పల్లకీలో దివ్యతేజం

May 17 2026 1:06 AM | Updated on May 17 2026 1:06 AM

మంత్రాలయం: శ్రీమఠం ప్రాంగణంలో భక్తుల మధ్య బంగారు పల్లకీలో ఉత్సమూర్తి కొలువుంచి ఉత్సవం నిర్వహించారు. అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం శ్రీరాఘవేంద్రస్వామి దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మూల బృందావన దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది. కల్పతరు దర్శన క్యూలైన్లు, అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లు భక్తులతో కిటకిటలాడాయి. తుంగ భద్ర నదీ తీరంలో భక్తుల కోలాహలం నెలకొంది. శ్రీమఠం ప్రాంగణంలో చిన్నబాలుడు శ్రీరాఘవేంద్రస్వామి వేషధారణలో చూడముచ్చటగా కనిపించారు. పాత ఊరిలో శ్రీలక్ష్మివెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement