పోలీసు పీజీఆర్‌ఎస్‌కు 94 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

పోలీసు పీజీఆర్‌ఎస్‌కు 94 ఫిర్యాదులు

May 12 2026 5:24 AM | Updated on May 12 2026 5:24 AM

కర్నూలు: కర్నూలు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పక్కనున్న క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం అడిషనల్‌ ఎస్పీ హుసేన్‌ పీరా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 94 ఫిర్యాదులు వచ్చాయి. అందులో ప్రధానంగా ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకుని మోసం, ఇళ్ల స్థలాలు, పొలాల ఆక్రమణలతో పాటు పలు వ్యక్తిగత సమస్యలపై ఫిర్యాదులు ఉన్నాయి. సీఐలు శివశంకర్‌, రామయ్య నాయుడు తదితరులు కూడా పీజీఆర్‌ఎస్‌లో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement