శిథిలావస్థలో ఎల్లెల్సీ వంతెన | - | Sakshi
Sakshi News home page

శిథిలావస్థలో ఎల్లెల్సీ వంతెన

May 12 2026 5:24 AM | Updated on May 12 2026 5:24 AM

పిల్లర్‌ రాళ్లు

ఊడి పడిన దృశ్యం

హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)పై నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. హొళగుంద మండలంలోని బళ్లారి రోడ్డులో ఉన్న ఈ వంతెన మీదుగా వందలాది వాహనాలు వెళ్తుంటాయి. వంతెన పిల్లర్ల రాళ్లు ఊడి పడి ప్రమాదకరంగా ఉండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్లెల్సీపై ఈ వంతెనను 1947లో నిర్మించారు. వాహనాలు తిరిగితే వంతెన నుంచి వింత శబ్దాలు వినిసిస్తున్నాయి. టీబీ బోర్డు అధికారులు స్పందించి రెండు లైన్ల కొత్త వంతెనను నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement