మంత్రాలయం: శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు వెండి రథంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. గురువారం భక్తులు స్వామి వారి దర్శనార్థం కర్ణాటక, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. భక్తులు తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు ఆచరించి గ్రామ దేవత మంచాలమ్మకు కుంకుమార్చన చేశారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మూలబృందావనం దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ మఠం ప్రాంగణంలో చెక్క, వెండి రథోత్సవాల పై ప్రహ్లాదరాయలు కొలువుంచి ఊరేగింపు నిర్వహించారు.
వెండి రథోత్సవాన్ని నిర్వహిస్తున్న దృశ్యం


