‘ఆయుష్‌’ పెరుగుతోంది | - | Sakshi
Sakshi News home page

‘ఆయుష్‌’ పెరుగుతోంది

Apr 10 2026 6:49 PM | Updated on Apr 10 2026 6:49 PM

ఆరోగ్య పునరుద్ధరణే లక్ష్యం 40 ఏళ్లుగా ఉచిత వైద్యం

హోమియోపతి ఏకై క లక్ష్యం ఆరోగ్య పునరుద్ధరణ. అంటే మనిషి చైతన్యపరంగా, శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా ఉండటం. దీనినే సిమిలియా సిమిలర్‌గా హనిమన్‌ వర్ణించారు. ఈ విధానంలో వ్యక్తి శారీరక, మానసిక వ్యాధి లక్షణాలను పరిగణలోకి తీసుకుని అవే లక్షణాలు కలిగిన హోమియో మందును ఎన్నుకుని చికిత్స చేస్తారు. ఈ వైద్యవిధానంలో వ్యాధి నివారణ శాశ్వతంగా, సమూలంగా, సత్వరంగా జరుగుతుంది.

– డాక్టర్‌ భారతీదేవి, ప్రభుత్వ హోమియో

వైద్యురాలు, వెల్దుర్తి డిస్పెన్సరీ

దయాల్బాగు రాధాస్వామి చారిటబుల్‌ హోమియో డిస్పెన్సరీ ద్వారా కర్నూలు నగరంలోని ధర్మపేటలో 40 ఏళ్లుగా పేద ప్రజలకు ఉచితంగా హోమియో వైద్యాన్ని అందిస్తున్నాం. ఈ క్లినిక్‌ ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు ఉంటుంది. అలాగే ప్రతి బుధవారం ధర్మపేటలో ఇంటింటికి తిరిగి పేదలకు ఒక్క రూపాయి ఫీజుతో వైద్యం అందిస్తున్నాం. ప్రతి రెండవ శనివారం ఎమ్మిగనూరు మండలం కోటేకల్‌ గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే దాదాపు 500 మందికి ఉచితంగా వైద్యం చేస్తున్నాం.

– డాక్టర్‌ కె.భాస్కరరెడ్డి,

హోమియో వైద్యులు, కర్నూలు

కర్నూలు(హాస్పిటల్‌): అవి మందులా అనిపించదు. నోట్లో వేసుకోగానే కమ్మగా, తియ్యగా, నాలుకపై ఇలాగే కరిగిపోతాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవ్వరైనా వీటిని సులభంగా వాడే అవకాశం ఉంది. ఇతర వైద్యవిధానాల వలే దుష్ప్రభావాలు ఇందులో ఉండవు. అదే హోమియోపతి వైద్యవిధానం. ప్రస్తుతం దీర్ఘకాలిక వ్యాధులకు, మొండిరోగాలకు ఇది మంచి ప్రత్యామ్నాయంగా రోగులు భావిస్తున్నారు. ఈ మేరకు ఈ వైద్య విధానానికి ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోంది. జర్మనీ దేశానికి చెందిన డాక్టర్‌ క్రిస్టియన్‌ ప్రెడరిక్‌ సామ్యుల్‌ హనీమన్‌ మొదటిసారిగా హోమియో విధానాన్ని కనుగొన్నారు. ఆయన జన్మించిన ఏప్రిల్‌ 10న వరల్డ్‌ హోమియో డేగా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆయుష్‌ విభాగం ఆధ్వర్యంలో 12 రెగ్యులర్‌తో పాటు జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద మరో 10 హోమియో డిస్పెన్సరీలు పనిచేస్తున్నాయి. ప్రతి డిస్పెన్సరీలో ప్రతిరోజూ 50 నుంచి 70 మంది వరకు రోగులు చికిత్స పొందుతున్నారు. గత కొన్నేళ్లుగా అల్లోపతి వైద్య విధానాలు ఉన్నచోటే వీటిని ఏర్పాటు చేశారు. ఈ కారణంగా ప్రత్యామ్నాయ వైద్యంగా హోమియో మంచి ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, డోన్‌లలో ఓపీ రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. జిల్లాలోని అన్ని డిస్పెన్సరీలు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుండగా ఇక్కడ చికిత్సతో పాటు మందులు కూడా ఉచితం. ఇటీవల కాలంలో హోమియో రంగంలో ప్రైవేటు వైద్యులు, కార్పొరేట్‌ కంపెనీలు క్లినిక్‌లు ఏర్పాటు చేయడంతో ఈ వైద్యానికి మరింత ప్రచారం, ఆదరణ పెరిగింది.

మొండి వ్యాధులకు చక్కని పరిష్కారం

కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు, మొండి రోగాలకు హోమియో చక్కటి పరిష్కారం చూపుతోంది. ఇతర వైద్య విధానాల్లో నయం కాని కొన్ని వ్యాధులకు రోగులు హోమియోలో చికిత్స పొంది పరిష్కారం పొందుతున్నారు. ముఖ్యంగా వెన్నునొప్పి, సయాటికా, మోకాళ్ల నొప్పులు, చర్మవ్యాధులు, పలు రకాల అలర్జీలు, తరచూ వచ్చే చీముగడ్డలు, గజ్జి, తామర, ఎగ్జిమా, చెవిలో చీము కారడం, ముక్కుదిబ్బడ, గొంతునొప్పి, స్టాన్సిలైటిస్‌, నాజిల్‌ పాలిప్స్‌, గ్యాస్‌ట్రబుల్‌, మలబద్దకం, పైల్స్‌, ఫిషర్‌, ఫిస్టులా, గాల్‌బ్లాడర్‌లో రాళ్లు, పసిరికలు, అమీబియాసిస్‌, నరాల సంబంధిత వ్యాధులు, కిడ్నీలో రాళ్లు, మైగ్రేన్‌ తలనొప్పి, డిప్రెషన్‌, క్రానిక్‌ ఫెటిగ్‌ సిండ్రోమ్‌, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, ప్రకోప ప్రేగు సిండ్రోమ్‌, ప్రీమెన్ర్ట్‌సువల్‌ సిండ్రోమ్‌ వంటి దీర్ఘకాలిక సమస్యలకు హోమియో మందులు బాగా ఫలితాలను ఇస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.

హోమియోకు పట్ల ప్రజల్లో ఆదరణ

ఉమ్మడి కర్నూలు జిల్లాలో

22 ప్రభుత్వ డిస్పెన్సరీలు

అన్ని చోట్లా ఉచితంగా

చికిత్స, మందులు

దీర్ఘకాలిక, మొండి రోగాలకు

మెరుగైన వైద్యం

నేడు వరల్డ్‌ హోమియో డే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement