కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విత్తన ప్రాసెసింగ్ యూనిట్లలో వ్యవసాయ అధికారులు తనిఖీలు చేపట్టారు. జిల్లాలో పత్తి, మొక్కజొన్న తదితర విత్తనాల ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రాసెసింగ్ యూనిట్ల తనిఖీలకు జిల్లా వ్యవసాయ అధికారి సంబంధిత ఏవో, ఏడీఏలకు ఆదేశాలు ఇచ్చారు. ఇందులో భాగంగా కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, కల్లూరు మండల వ్యవసాయ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి కల్లూరు మండల పరిధిలోని సహజ క్రాప్ సైన్సెస్, మార్క్యివ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో తనిఖీలు చేపట్టారు. సహజ క్రాప్ సైన్సెస్‌లో ప్రాసెసింగ్ చేసిన పత్తి విత్తనాలకు సంబంధించి మూడు లాట్లతో హెచ్‌టీ పరీక్షలు నిర్వహించారు. అయితే హెచ్‌టీ లేదని తేలింది. మహంకాలేశ్వర సీడ్స్‌లో మొక్కజొన్న విత్తనాల ప్రాసెసింగ్‌ను పరిశీలిచారు. 2026–27 సంవత్సరానికి బీటీ పత్తి విత్తన ధరలు ఖరారు కానందున ఇంకా ప్యాకింగ్ చేయని పరిస్థితి. ప్రాసెసింగ్ యూనిట్లలో రికార్డులను క్షుణంగా పరిశీలించారు.


