కర్నూలు: గ్రూప్–2 పరీక్ష ఫలితాల్లో ఎకై ్సజ్ శాఖ కర్నూలు జోన్ కింద ఎంపికై న 42 మంది అభ్యర్థుల్లో శనివారం 21 మందికి దేహదారుఢ్య, వైద్యపరీక్షలు నిర్వహించారు. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, జిల్లా అధికారి సుధీర్ బాబు సమక్షంలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి అనంతరం ప్రభుత్వాసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించారు. జూన్ 12న వీరికి డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు.
ఆదోని పీఆర్ ఈఈగా రాజన్న
కర్నూలు(అర్బన్): ఆదోని పంచాయతీరాజ్ ఈఈగా అనంతపురం జిల్లా మడకశిర సబ్ డివిజన్ పీఐయు డీఈఈగా విధులు నిర్వహిస్తున్న బి.రాజన్నకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తు పీఆర్ ఈఎన్‌సీ బి.బాలునాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఆదోని ఈఈగా విధులు నిర్వహించిన డీసీ వెంకటేష్ సెలవులో వెళ్లిన కారణంగా రాజన్నకు బాధ్యతలు అప్పగించారు.
నేడు జెడ్పీలో ‘స్థానిక’ మహిళా ప్రజా ప్రతినిధుల కన్వెన్షన్
కర్నూలు(అర్బన్): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పీఆర్ అండ్ ఆర్‌డీ కమిషనర్ ఉత్తర్వుల మేరకు స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో ఈ నెల 8న ఉదయం 10 గంటలకు సాంప్రదాయ ఆచరణ(కన్వెన్షన్) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాకు చెందిన మహిళా ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు హాజరు కావాలని కోరారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆయా మండలాలకు చెందిన ఎంపీడీఓలు తమ పరిధిలోని స్థానిక సంస్థలకు చెందిన మహిళా ప్రజా ప్రతినిధులకు కార్యక్రమ ఉద్దేశాన్ని తెలియజేసి వారందరూ హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.


