ఫిబ్రవరి 18 నుంచి శ్రీ రాఘవేంద్రుల గురు వైభవోత్సవాలు
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలో కొలువైన శ్రీ రాఘవేంద్రస్వాముల గురు వైభవోత్సవాలు ఫిబ్రవరి 18 నుంచి 24వ తేది వరకు నిర్వహిస్తున్నట్లు శ్రీ మఠం మేనేజర్ యస్‌కె.శ్రీనివాసరావు తెలిపారు. ముందుగా శ్రీ రాఘవేంద్రుల గురు వైభవోత్సవ ఆహ్వాన పత్రికను శ్రీ రాఘవేంద్ర స్వాముల మూలబృందవనం చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేసి మంగళహారతి ఇచ్చారు. అనంతరం శ్రీ మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు చేతుల మీదుగా గురువైభవోత్సవ ఆహ్వాన పత్రికను ప్రారంభించారు. మేనేజర్ ఎస్‌కె.శ్రీనివాసరావు మట్లాడుతూ భక్తులు వైభవోత్సవాల్లో పాల్గొని స్వామి ఆశీర్వాదం పొందాలని కోరారు. ఫిబ్రవరి 19న గురు వైభవోత్సవాల్లో భాగంగా 405వ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తామన్నారు.


