అప్రెంటిస్‌కు ఎంపికై న వారు 22లోపు హాజరు కావాలి | - | Sakshi
Sakshi News home page

అప్రెంటిస్‌కు ఎంపికై న వారు 22లోపు హాజరు కావాలి

Jan 13 2026 5:47 AM | Updated on Jan 13 2026 5:47 AM

అప్రె

అప్రెంటిస్‌కు ఎంపికై న వారు 22లోపు హాజరు కావాలి

కర్నూలు సిటీ: జిల్లాలో 2025–26 అప్రెంటిస్‌కు ఎంపికై న అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోపు ఆర్టీసీ జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీలో హాజరుకావాలని ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌ రామకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీజిల్‌ మెకానిక్‌ విభాగంలో 204, 2, 93, 236, 269, 167, 227, 98, 232, 137, 74, 202, 246, 201, 166, 205, 108, 92, 300, 266, 5, 112, 117, 283, 260, 309, 27, 63, 307, 69, 174, 282, 224, మోటర్‌ మెకానిక్‌ విభాగంలో 12, 28, 14, 35, 7, ఎలక్ట్రీషియన్‌ 16, 281, 74, 129, వెల్డర్‌ విభాగం 4, ఫిట్టర్‌ విభాగంలో 7, డ్రాఫ్ట్‌మెన్‌ విభాగంలో 7 అనే నంబరు గల వారు అప్రెంటిస్‌కు ఎంపికయ్యారన్నారు.

ఓటరు మ్యాపింగ్‌లో పురోగతి తీసుకురావాలి

కర్నూలు(సెంట్రల్‌): స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)లో భాగంగా చేపట్టిన ఓటరు మ్యాపింగ్‌ ప్రక్రియలో పురోగతిని తీసుకు రావాలని డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ తహసీల్దార్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాలునుంచి రెవెన్యూ క్లినిక్‌లు, పీజీఆర్‌ఎస్‌, యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే తదితర అంశాలపై కలెక్టర్‌ మండలాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, హౌసింగ్‌ పీడీ చిరంజీవి, ఎస్‌డీసీలు అనురాధ, సునీత పాల్గొన్నారు.

18 మద్యం బాటిళ్లు స్వాధీనం

కోవెలకుంట్ల: మండలంలోని వల్లంపాడులో సోమవారం ఓ మహిళ వద్ద నుంచి 18 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ ధనుంజయులు అందించిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన మాధవి అనే మహిళ బెల్ట్‌షాపుద్వారా మద్యం బాటిళ్లు విక్రయిస్తుండగా అందిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఆమె వద్ద 10 మద్యం, ఎనిమిది బీరుబాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.అలాగే అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

బైక్‌పై వచ్చి..డబ్బులు దోచుకెళ్లి

కోడుమూరు రూరల్‌: పట్టణంలోని ఎస్‌బీఐ బ్యాంకు వద్ద రూ.2 లక్షల చోరీ జరిగింది. బైక్‌ సైడ్‌బ్యాగ్‌లో పెట్టి బ్యాంక్‌ లోపలికి వెళ్లి వచ్చేలోపు ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. దేవనకొండ మండలంలోని ఐరనబండ బి.సెంటర్‌ గ్రామానికి చెందిన ఖాసీంవలి తెర్నేకల్‌ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో బిజినెస్‌ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రికవరీ అమౌంట్‌ రూ.2 లక్షలు తీసుకుని కోడుమూరులోని ఎస్‌బీఐ బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి మరిన్ని డబ్బులు తీసుకునేందుకు స్నేహితుడు అనూక్‌తో కలిసి బైక్‌పై వచ్చాడు. డబ్బును బైక్‌ సైడ్‌ బ్యాగులో ఉంచి స్నేహితుడిని అక్కడే ఉండమని చెప్పి ఖాసీంవలి బ్యాంకులోకి వెళ్లాడు. ఎంతసేపటికి అతను తిరిగి రాకపోవడంతో స్నేహితుడు అనూక్‌ బ్యాంక్‌ వద్దకెళ్లాడు. తిరిగివస్తుండగానే ఇద్దరు వ్యక్తులు ముసుగులు ధరించి బైక్‌పై వేగంగా వచ్చి డబ్బులున్న బ్యాగును ఎత్తుకెళ్లారు. ఈమేరకు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎర్రిస్వామి తెలిపారు.

అభివృద్ధికి తోడ్పాటు అవసరం

కర్నూలు(సెంట్రల్‌): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కార్పొరేట్‌ సంస్థల తోడ్పాటు అవసరమని కలెక్టర్‌ డాక్టర్‌ సిరి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో ఆర్సెలర్‌ మిట్టల్‌గ్రీన్‌ ఎనర్జీ సంస్థ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సబులిటీ(సీఎస్‌ఆర్‌) కింద చిన్నటేకూరు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సెంటనరీ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీకి రూ.10 లక్షలు, ఓర్వకల్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు రూ.10 లక్షలు చొప్పున ఆ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌, ప్రాజెక్టు హెడ్‌ కో ఆర్డినేటర్‌ శ్రీధర్‌ పరవాడ కలెక్టర్‌కు అందజేశారు.

అప్రెంటిస్‌కు ఎంపికై న వారు 22లోపు హాజరు కావాలి 1
1/4

అప్రెంటిస్‌కు ఎంపికై న వారు 22లోపు హాజరు కావాలి

అప్రెంటిస్‌కు ఎంపికై న వారు 22లోపు హాజరు కావాలి 2
2/4

అప్రెంటిస్‌కు ఎంపికై న వారు 22లోపు హాజరు కావాలి

అప్రెంటిస్‌కు ఎంపికై న వారు 22లోపు హాజరు కావాలి 3
3/4

అప్రెంటిస్‌కు ఎంపికై న వారు 22లోపు హాజరు కావాలి

అప్రెంటిస్‌కు ఎంపికై న వారు 22లోపు హాజరు కావాలి 4
4/4

అప్రెంటిస్‌కు ఎంపికై న వారు 22లోపు హాజరు కావాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement