యాగంటీశ్వరుడి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
బనగానపల్లె: పవిత్ర శైవక్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వరస్వామిని ఆదివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జి ప్రవీణ్‌కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ చైర్మన్ బండి మౌలిశ్వరరెడ్డి, ఈఓ పాండు రంగారెడ్డి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. ఆ తరువాత హైకోర్టు న్యాయమూర్తి కుటుంబసభ్యులను సన్మానించి ఉమామహేశ్వరస్వామి చిత్ర పటాన్ని,తీర్థప్రసాదాన్ని అందజేశారు.
నాలుగు తులాల బంగారం అప్పగింత
ఆదోని అర్బన్: ఆటోలో మరిచిపోయిన నాలుగుతులాల బంగారాన్ని గుర్తించి బాధితురాలికి పోలీసులు అప్పగించారు. వన్‌టౌన్ సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు..అనంతపురం పట్టణానికి చెందిన విజయలక్ష్మి భర్తతో కలిసి శనివారం ఆదోనికి వచ్చారు. బస్టాండ్‌లో బస్సు దిగిన తర్వాత ఆటో ఎక్కి పట్టణంలోని అమ్మ ఇంటికి వెళ్లారు. ఆటోలో హ్యాండ్ బ్యాగు మరిచిపోయారు. అందులో రూ.5 లక్షలు విలువచేసే నాలుగు తులాల బంగారం, ఒక ఫోన్ ఉంది. కొద్దిసేపటి తర్వాత బ్యాగ్ లేదని గుర్తించిన విజయలక్ష్మి వెంటనే వెంటనే వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే బ్యాగ్‌లో ఉన్న ఫోన్ నంబర్ తీసుకుని లొకేషన్ ద్వారా ఆటో ఎక్కడ ఉందో గుర్తించి సమాచారం అందించారు. డ్రైవర్ విద్యాసాగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగ్‌ను బాధిత మహిళకు అందించారు. దీంతో ఆటో డ్రైవర్ విద్యాసాగర్‌ను సీఐ శాలువా కప్పి సన్మానించారు. వెనుక సీటులో ఉన్న బ్యాగును తాను ముందే చూసి ఉంటే వెంటనే ఇచ్చేవాడినని డ్రైవర్ ఈ సందర్భంగా తెలిపారు.
మంత్రాలయం రూరల్ : 1990–91 బ్యాచ్‌కు చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు 35 సంవత్సరాల తరువాత కలుసుకున్నారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ రాఘవేంద్రస్వామి ఆశీస్సులతో గురువుల చేత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చనిపోయిన గురువులు, పూర్వ విద్యార్థులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. గురువులను పూలమాలతో సన్మానించారు. అనంతరం రుచికరమైన వంటకాలతో కలసి కట్టుగా భోజనం చేశారు. కార్యక్రమంలో గురువులు, పూర్వ విద్యార్థులు శంకరయ్య, మాబు, బసప్ప, సరోజ, సూర్యనారయణ, శ్రీకాంత్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
యాగంటీశ్వరుడి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
యాగంటీశ్వరుడి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి


