యాదవులను గుర్తించని చంద్రబాబు ప్రభుత్వం
● అఖిల భారత యాదవ మహాసభ నేతలు
కర్నూలు(అర్బన్): రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం యాదవులను గుర్తించకపోవడం దారుణమని అఖిల భారత యాదవ మహాసభ నేతలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక శకుంతల కళ్యాణ మండపం ఆవరణలో నందికొట్కూ రు, బనగానపల్లె నియోజకవర్గాలకు చెందిన యాదవ సంఘాలు ముద్రించిన 2026 సంవత్సరం క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మహాసభ రాయలసీమ కన్వీనర్ టీ శేషఫణి యాదవ్, నాయకు లు సదానందం యాదవ్, ఓంకార్ యాదవ్, బాల చెన్నయ్య యాదవ్, మల్లికార్జున యాదవ్, దేవశంకర్‌యాదవ్, రాముడు యాదవ్ తదితరులు హాజరయ్యా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదవ సామాజిక వర్గానికి చెందిన కాటమరాజు ముత్తుకూరు గౌడప్ప యాదవ్, గోసాయి వెంగన్నయాదవ్ వంటి మహోన్నత వ్యక్తులు అనేక ఉద్యమాలు చేశారన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర పండుగల జాబితాలో ఒక్క యాదవ రాజుకు కూడా స్థానం కల్పించకపోవడం శోచనీయమన్నారు. ఇదే వైఖరితో వ్యవహరిస్తే భవిష్యత్తులో యాదవుల శక్తిని ఈ ప్రభుత్వానికి చూపిస్తామన్నారు.యాదవ నేతలు విజయభాస్కర్‌యాదవ్, శ్రీనివాసులు యాదవ్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


