మహిళల ఆర్థికాభివృద్ధిలో బ్యాంకులే కీలకం
కర్నూలు(అగ్రికల్చర్): స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడంలో బ్యాంకులు అత్యంత కీలకమని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వైవీ రమణారెడ్డి తెలిపారు. బుధవారం డీఆర్‌డీఏ కార్యాలయంలో బ్యాంకర్లు, ఏపీఎంలు, ఏసీలు, డీపీఎంలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పీడీ మాట్లాడారు. పొదుపు సంఘాలకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు మరింత చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బ్యాంకు లింకేజీ, పైనాన్సియల్ ఇంక్లూజన్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఎల్‌డీఎం రామచంద్రరావు మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతున్నాయన్నారు. రుణాల పంపిణీలో బ్యాంకులు, సెర్ఫ్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ అదనపు పీడీ శ్రీధర్‌రావు పాల్గొన్నారు.
డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ రమణారెడ్డి


