అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
డోన్ రూరల్: స్థానిక రైల్వే స్టేషన్‌లోని నాలుగో నెంబర్ ప్లాట్‌ఫారం వద్ద బుధవారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. రైల్వే ఎస్‌ఐ బిందుమాధవి తెలిపిన వివరాలు.. ఉదయం 8 గంటల సమయంలో ప్లాట్‌ఫారం వద్ద ఓ వ్యక్తి విగతజీవిగా పడి ఉన్నాడని సమాచారం అందడంతో రైల్వే ఎస్‌ఐ అక్కడికి చేరుకుని పరిశీలించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. మృతుని వద్ద ఉన్న సెల్ ఫోన్, ఆధార్‌కార్డు ఆధారంగా స్థానిక పోచా ప్రభాకర్‌రెడ్డి కాలనీకి చెందిన తూర్పాటి వెంకటేశ్వర్లు(44)గా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహానికి డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామని ఎస్‌ఐ తెలిపారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉందన్నారు. మృతునికి భార్య హుసేనమ్మ, కూతురు, ముగ్గరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామన్నారు.


