బాబూ జగ్జీవన్‌రామ్ ఆశయ సాధనకు కృషి
కర్నూలు(అర్బన్): డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ ఆశయ సాధనకు, సమసమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య పిలుపునిచ్చారు. శనివారం బాబూ జగ్జీవన్‌రామ్ 118వ జయంతి సందర్భంగా స్థానిక ఆర్‌ఎస్ రోడ్డులోని ఆయన విగ్రహానికి పెద్ద సంఖ్యలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిస జయంతి సభలో జేసీతో పాటు సాంఘిక సంక్షేమ శాఖ జేడీ జె.రంగలక్ష్మిదేవి, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, డీఎస్పీ మహబూబ్‌బాషా తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో కోడుమూరు, పాణ్యం ఎమ్మెల్యేలు బొగ్గుల దస్తగిరి, గౌరు చరితారెడ్డి, మాజీ మంత్రి ఎం.మారెప్ప పాల్గొన్నారు. జేసీ నవ్య మాట్లాడుతూ నేటి విద్యార్థులు కూడా జగ్జీవన్‌రామ్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మనిషి అభివృద్ధికి పేదరికం అడ్డురాదని జగ్జీవన్‌రామ్ నిరూపించారన్నారు. ఆయన పేదరికాన్ని అధిగమించి బనారస్ విశ్వ విద్యాలయం నుంచి పట్టభద్రులు అయ్యారన్నారు. సుదీర్ఘకాలం కేంద్రంలో అనేక మంత్రిత్వ శాఖలను నిర్వహించి ఆయా శాఖల్లో తనదైన ముద్రను వేశారన్నారు.
● పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ బాబూ జగ్జీవన్‌రామ్ గొప్ప సంఘ సంస్కర్త అన్నారు. 40 సంవత్సరాలు ఓటమి ఎరుగని నాయకుడిగా ఆయన దేశంలోనే గుర్తింపు పొందారన్నారు. ఆయన కుమార్తె మీరా కుమారి పార్లమెంట్ స్పీకర్‌గా ఉండి తన ప్రతిభనుచ కనబరిచారన్నారు.
● కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ అంటరానితనం పోవాలని పోరాటాలు నిర్వహించిన దళిత ముద్దు బిడ్డ జగ్జీవన్‌రామ్ అని కొనియాడారు. 1937లో అతి చిన్న వయస్సులోనే బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారన్నారు.
● ఇదిలాఉంటే ఉత్సవాలకు తనకు ఆహ్వానం లేదని మాజీ ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబు అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వేదిక ఎక్కకుండా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కుర్చీలోనే కూర్చొన్నారు. కార్యక్రమంలో ప్రజా, దళిత సంఘాల నాయకులు సోమసుందరం మాదిగ, అనంతరత్నం మాదిగ, రాజ్‌కుమార్, వేల్పుల జ్యోతి, నాగేశ్వరి, ఎన్‌సీహెచ్ బజారన్న, ఆర్.కై లాస్‌నాయక్, ఆర్.చంద్రప్ప, ఎం.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
బాబూ జగ్జీవన్‌రామ్ ఆశయ సాధనకు కృషి


