తూతూమంత్రంగా ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర మెటీరియల్‌ | - | Sakshi
Sakshi News home page

తూతూమంత్రంగా ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర మెటీరియల్‌

Mar 25 2025 1:39 AM | Updated on Mar 25 2025 1:33 AM

గత తొమ్మిది నెలల్లో

ఇదీ పరిస్థితి..

విడుదల డివిజన్‌ ఏడాది

చేసిన కాలంగా

విద్యుత్‌ నిరీక్షిస్తున్న

కనెక్షన్‌లు రైతుల సంఖ్య

341 ఆదోని 3,766

310 కర్నూలు టౌన్‌ 1,220

351 ఎమ్మిగనూరు 2,656

179 నంద్యాల 2,427

164 ఆత్మకూరు 867

129 డోన్‌ 1,357

1,474 మొత్తం 12,293

విద్యుత్‌ కనెక్షన్లకు గ్రహణం

తొమ్మిది నెలలు గడుస్తున్నా

మంజూరులో జాప్యం

ఇప్పటి వరకు ఇచ్చిన

కనెక్షన్లు 1,474

ఉమ్మడి జిల్లాలో

12,293 రైతుల నిరీక్షణ

ఏడాది క్రితం డబ్బు చెల్లించినా

నోరు మెదపని అధికారులు

మాకు ఐదెకరాల భూమి ఉంది. రెండు బోర్లు ఉన్నాయి. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ కోసం ఏడాది క్రితం విద్యుత్‌ మా వాటా కింద రూ.18,600 చెల్లించాం. ఇప్పటి వరకు కనెక్షన్‌ ఇవ్వలేదు. పోల్స్‌, మెటీరియల్‌ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. అదిగో ఇదిగో అని తిప్పిపంపుతున్నారు. బోర్లలో నీళ్లున్నా ఉపయోగించుకోలేకపోతున్నాం.

– కమ్మరి చిన్న రంగస్వామి, జిల్లేడుబుడకల గ్రామం, దేవనకొండ మండలం

మాకు ఎనిమిది ఎకరాల భూమి ఉంది. రెండు బోర్లు వేయించాం. 2023 డిసెంబర్‌లో విద్యుత్‌ కనెక్షన్‌ కోసం రైతు వాటాగా రూ.80 వేలు చెల్లించాం. ఇప్పటికి ఏడాది గడిచిపోయినా కనీసం పోల్స్‌ కూడా ఇవ్వలేదు. నీళ్లు ఉన్నా కనెక్షన్‌ ఇవ్వకపోవడంతో భూములను ఖాళీగా ఉంచుకున్నాం. డోన్‌లోని డీఇ, ఏడీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం.

– ధర్మవరం సుబ్బరాయుడు,

ఓబులదేవరపల్లి గ్రామం, ప్యాపిలి మండలం

కర్నూలు(అగ్రికల్చర్‌): వర్షాధారం కింద పంటల సాగు గాలిలో దీపంగా మారింది. బావులు, బోర్లలోని అంతంతమాత్రం నీటితో పంటలు పండించుకోవాలని ఆశించిన రైతులకు నిరాశే మిగులుతోంది. వ్యవసాయ విద్యుత్‌ పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతోంది. కొత్త విద్యుత్‌ కనెక్షన్‌ల కోసం వేలాది మంది రైతులు డబ్బు చెల్లించి కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు. విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తే బోర్ల కింద కూరగాయల పంటలు, ఆరుతడి పంటలు సాగు చేసుకోవచ్చనే ఉద్దేశంతో రైతులు ఉన్నారు. అయితే కనెక్షన్ల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోంది. విద్యుత్‌ అధికారులు వేసిన ఎస్టిమేట్ల ప్రకారం డబ్బులు చెల్లించినప్పటికీ 12,293 మంది రైతులు కనెక్షన్‌ ఎప్పుడిస్తారో తెలియక విద్యుత్‌ అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.

తొమ్మిది నెలల్లో 1,474 కనెక్షన్లు

కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు తొమ్మిది నెలలు పూర్తవుతోంది. ఈ మధ్య కాలంలో ఇచ్చిన కనెక్షన్లు 1,474 మాత్రమే. కర్నూలు జిల్లాలో 1,002, నంద్యాల జిల్లాలో 472 మాత్రమే విడుదలయ్యాయి. నిబంధనల ప్రకారం సీనియారిటీకి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నా.. టీడీపీ నేతల జోక్యంతో అర్హులకు అన్యాయం జరుగుతోందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా వైఎస్‌ఆర్‌సీపీ వాళ్లకు ఎలాంటి పనులు చేయరాదని బహిరంగంగా చెప్పడంతో కిందిస్థాయి టీడీపీ నేతలు మరింత చెలరేగిపోతున్నారు.

పేరుకుపోతున్న దరఖాస్తులు

వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ల కోసం రైతులు వేలాది రూపాయలు చెల్లించారు. ఉమ్మడి జిల్లాలో 12,293 మంది రైతులు తమ వాటా మొత్తం చెల్లించి కనెక్షన్ల కోసం నిరీక్షిస్తున్నారు. కర్నూలు జిల్లాలో 7,642, నంద్యాల జిల్లాలో 4,651 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌లు పెండింగ్‌లో ఉండిపోయాయి. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులు మరో 6వేల మంది ఉన్నారు. ఈ రైతులకు సంబంధించి విద్యుత్‌ అధికారులు ఎస్టిమేట్లు వేసి డిమాండ్‌ నోటీసులు ఇస్తే తమ వాటా సొమ్ము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వ్యవసాయ విద్యుత్‌పై అలసత్వం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.

ట్రాన్స్‌పార్మర్లు కాలిపోతే దక్కులేదు

కొత్త వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌లు ఇచ్చేందుకు మెటీరియల్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇదే సమయంలో పాత కనెక్షన్‌లకు సంబంధించి ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే వెంటనే ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వ్యవసాయానికి అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. నాటి ప్రభుత్వ ఆదేశాల మేరకు దళారీల ప్రమేయం లేకుండా.. రైతుల నుంచి ఒక్క రూపాయి వసూలు చేయకుండా ట్రాన్స్‌ఫార్మర్లను సరఫరా చేసి ఏర్పాటు చేయడం విశేషం. నిబంధనల ప్రకారం ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయినప్పుడు కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుకు 24 గంటల సమయం ఉంటుంది. ఇప్పుడు వారం రోజులు దాటినా ట్రాన్స్‌ఫార్మర్లు సరఫరా చేయలేని పరిస్థితి.

మే చివరికి పూర్తి చేస్తాం

వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల మంజూరు ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 1,474 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు విడుదల చేశాం. ఇంకా 12,293 కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. మే నెల చివరికి పూర్తి చేస్తాం. సీనియారిటీ ప్రకారం కనెక్షన్లు ఇస్తాం.

– ఉమాపతి, ఎస్‌ఇ, విద్యుత్‌ శాఖ, కర్నూలు జిల్లా

ఈ చిత్రం మద్దికెర మండలం బసినేపల్లి గ్రామంలోనిది. బోర్లలో నీళ్లు పడినా రైతులుపంటలు పండించుకోలేని పరిస్థితి. ఆరేడుగురు రైతులు 14–15 నెలల క్రితం బోర్లు వేయించుకున్నారు. బోర్లలో ఆశాజనకంగా నీళ్లు పడ్డాయి. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ల కోసం ఏడాది క్రితం దరఖాస్తు చేసుకున్నారు. విద్యుత్‌ అధికారులు ఎస్టిమేట్లు వేశారు. రైతులు తమ వాటా మొత్తాన్ని డీడీ తీశారు. ఆ మేరకు పోల్‌ సరఫరా చేసి నాటారు. ఇతర మెటీరియల్‌ ఇవ్వకపోవడంతో నీళ్లున్నా విద్యుత్‌ కనెక్షన్‌ లేక భూములను ఖాళీగా ఉంచుకున్నారు.

వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌లు ఇవ్వడానికి ట్రాన్స్‌ఫార్మర్లతో పాటు కండక్టర్‌, కేబుల్‌ కొరత ఉంది. 2024 జూలై 25 నాటి వరకు పెండింగ్‌లో ఉన్న వాటికి ట్రాన్స్‌ఫార్మర్లు సరఫరా అయ్యాయి. పెండింగ్‌లో ఉన్న మొత్తం కనెక్షన్‌లకు ఇంకా 1,900 ట్రాన్స్‌ఫార్మర్లు అవసరం. ఈ ట్రాన్స్‌ఫార్మర్లు ఎప్పటికి వస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. 2వేల కిలోమీటర్లకు కండక్టర్‌, కేబుల్‌ అవసరం కాగా.. ఇందుకోసం రైతులు తగిన మొత్తాన్ని చెల్లించారు. అయితే సరఫరా చేయడంలో ప్రభుత్వం చేతులెత్తేస్తోంది.

తూతూమంత్రంగా ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర మెటీరియల్‌ 
1
1/2

తూతూమంత్రంగా ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర మెటీరియల్‌

తూతూమంత్రంగా ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర మెటీరియల్‌ 
2
2/2

తూతూమంత్రంగా ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర మెటీరియల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement