మంత్రాలయం: శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో ప్రతి ఏటా శ్రీమన్ న్యాయసుధ మంగళ మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల నేతృత్వంలో మంగళ మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. వివిధ పీఠాధిపతులు జ్యోతి ప్రజ్వలనతో మహోత్సవానికి అంకురార్పణ పలికారు. మహోత్సవంలో భాగంగా రాఘవేంద్ర స్వామి రచించిన శ్రీమన్ న్యాయసుధ గ్రంథంపై వ్యాక్యార్థగోష్టి నిర్వహించారు. ముందుగా వేద వ్యాసుడి పూజోత్సవం, శ్రీమన్ న్యాయసుధ శోభయాత్ర భక్తులను అలరించింది. వేడుకలో వ్యాసరాజ మఠం పీఠాధిపతి విద్యాశ్రీషా తీర్థులు, శ్రీపాదరాజ మఠం పీఠాధిపతి సుజయనిధి తీర్థులు, కృష్ణాపుర మఠం పీఠాధిపతి విద్యాసాగర తీర్థులు, కనియూరు మఠం పీఠాధిపతి విద్యావల్లభతీర్థులు, శిరూర్ మఠం పీఠాధిపతి వేదవర్ధన తీర్థులు, అధమారు మఠం పీఠాధిపతి ఈషాప్రియ తీర్థులు, బందరకెరె మఠం పీఠాధిపతి విద్ద్యేశ తీర్థులు, కన్వమఠం పీఠాదిపతి విద్యాకన్వ విరాజ తీర్థులు, బాలఘర్ మఠం పీఠాధిపతి అక్షోభ్య రామ ప్రియతీర్థులు , చిత్తాపూర్ మఠం పీఠాధిపతి విద్ద్యేంద్ర తీర్థులు, ఉడిపి మఠం పీఠాధిపతులు బన్నంజే రాఘవేంద్ర తీర్థులు, వామన తీర్థులు పాల్గొన్నారు.