కోసిగి: గరివిడి లక్ష్మీ చిత్ర యూనిట్ సభ్యులు శనివారం కోసిగిలోని దొరల ఇంటి ఆవరణలో షూటింగ్ చేశారు. గరివిడి లక్ష్మీ అనే సినిమాలో ఆనంది హీరోయిన్‌గా నటిస్తున్నారు. కోసిగిలోని దొరల ఇంటిలో గ్రామీణ ప్రాంత సర్పంచ్ సన్నివేశం చిత్రీకరించారు. సాయంత్రం గ్రామ సమీపంలో ఓ మొక్కజొన్న పైరులో మరికొన్ని సన్నివేశాలు చీత్రికరిస్తున్నట్లు యూనిట్ సభ్యులు తెలిపారు. గ్రామంలో దొరల ఇంటిలో షూటింగ్ జరుగుతుండడంతో చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు చూడడానికి ఎగపడ్డారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ బందోబస్తు కల్పించారు.