శ్రీశైల దేవస్థానానికి వెండి వస్తువుల విరాళం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానానికి హైదరాబాద్‌కు చెందిన యం. జ్యోతిర్మయి వెండి పళ్లెం, రెండు గిన్నెలు, దీపం విరాళంగా సమర్పించారు. శనివారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు వీటిని పర్యవేక్షకులు గంజి రవి, అమ్మవారి ఆలయం ఇన్‌స్పెక్టర్ కె. మల్లికార్జున, జూనియర్ అసిస్టెంట్ ఎం.సావిత్రికి అందజేశారు. ఈ వెండి వస్తువుల బరువు 630 గ్రాములు ఉంటుందని దాతలు తెలిపారు. అనంతరం వీరికి రశీదును అందజేసి, వేదాశీర్వచనంతో శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు అందజేసి సత్కరించారు.
మహానందీశ్వరుడి సేవలో
మహానంది: మహానందీశ్వరస్వామిని చైన్నె రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రాష్ట్ర చైర్మన్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుబ్బయ్య దంపతులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. శనివారం దర్శనానికి వచ్చిన వారికి ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి స్వాగతం పలికారు. ఈ మేరకు వారు శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వారికి స్థానిక అలంకార మండపంలో స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేశారు.
పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
సంజామల: చిన్న కొత్తపేట గ్రామ సమీపంలో ఓ కారు అదుపు తప్పి వరిమడిలోకి దూసుకెళ్లింది. ప్యాపిలి మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు పసురు కట్టు కోసం శనివారం కారులో ఆర్.లింగందిన్నెకు చేరుకున్నారు. కట్టు కట్టించుకుని తిరిగి వెళ్తుండగా చిన్న కొత్తపేట గ్రామ సమీపంలో అదుపు తప్పి పక్కనే ఉన్న పొలంలోకి దూసుకుపోయింది. వాహనంలో ఉన్న వ్యక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. గ్రామస్తుల సహకారంలో జేసీబీతో కారును బయటకు తీశారు.
శ్రీశైల దేవస్థానానికి వెండి వస్తువుల విరాళం
శ్రీశైల దేవస్థానానికి వెండి వస్తువుల విరాళం


