ఎస్టీ సాధనకు త్యాగాలకై నా సిద్ధం
● జేవీఐపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుర్రా ఈశ్వరయ్య
కర్నూలు(అర్బన్): వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేంత వరకు ఎంతటి త్యాగాలకై నా సిద్ధంగా ఉన్నామని జాతీయ వాల్మీకి ఐక్య పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుర్రా ఈశ్వరయ్య అన్నారు. శనివారం స్థానిక బళ్లారి చౌరస్తా సమీపంలోని కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సవేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వాల్మీకుల చిరకాల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సాన్నిహిత్యంతో పార్లమెంట్‌లో వాల్మీకుల ఎస్టీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ఇందుకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీల్లోని వాల్మీకులందరు ఐకమత్యంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సి ఉందన్నారు. వాల్మీకుల ఎస్టీ సాధనతోనే వాల్మీకులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సమావేశంలో జేవీఐపీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు బోయ రామకృష్ణ, లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శీలం భాస్కర్‌నాయుడు, కర్నూలు, ఆదోని, పత్తికొండ, కోడుమూరు నియోజకవర్గ నేతలు కుంపటి క్రిష్ణ, వీరేష్, ఆనంద్, గోపినాథ్‌నాయుడు, హనుమంతప్ప, నాయకులు ఉల్చాల వెంకటేశ్వర్లు, డోన్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.


