శ్రీమఠంలో భక్తుల సందడి | - | Sakshi
Sakshi News home page

శ్రీమఠంలో భక్తుల సందడి

Mar 21 2025 1:58 AM | Updated on Mar 21 2025 1:53 AM

మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో భక్తుల సందడి నెలకొంది. గురువారం ప్రత్యేకం కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. స్థానిక తుంగభద్ర నది, శ్రీమఠం ప్రాంగణం, మధ్వాచార్‌ కారిడార్‌లు భక్తులతో కిక్కిరిశాయి. స్వామి మూల బృందావన దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. రాఘవేంద్రస్వామి, గ్రామ దేవత మంచాలమ్మ, అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాద కౌంటర్ల వద్ద భక్తులు బారులు తీరడం కనిపించింది.

ఫార్మసీ ఉద్యోగ నియామక ప్రక్రియ నిలిపివేత

కర్నూలు(హాస్పిటల్‌): కడప జోన్‌–4 పరిధిలో కాంట్రాక్టు ఫార్మసీ ఆఫీసర్‌ ఉద్యోగాల నియామక ప్రక్రియ హైకోర్టు ఉత్తర్వుల మేరకు తాత్కాలికంగా నిలిపివేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ అధికారి డాక్టర్‌ బి.రామగిడ్డయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హైకోర్టు నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చిన తర్వాత నియామక ప్రక్రియ చేపడతామన్నారు. ఈ విషయాన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు గమనించాలని కోరారు.

డీఈఓ బ్లాగ్‌లో టీచర్ల

సీనియారిటీ జాబితా

కర్నూలు సిటీ: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా డీఈఓ బ్లాగ్‌లో ఉంచామని డీఈఓ ఎస్‌.శ్యామూల్‌ పాల్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్కూల్‌ అసిస్టెంట్లు(అన్ని సబ్జెక్టులు), ఎస్‌జీటీ తత్సమాన అర్హత కలిగిన వారి సీనియారిటీ జాబితా సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఈ జాబితాలను https://deokrnl13blogspot.com అనే బ్లాగ్‌లో అందుబాటులో ఉన్నాయని, అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23వ తేదీలోపు ఆధారాలతో సంప్రదించాలని తెలిపారు.

చెత్త వాహనాలతో నిరసన

కర్నూలు (టౌన్‌): నగరంలో మొండి బకాయిలు రాబట్టేందుకు మున్సిపల్‌ సిబ్బంది వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక దేవనగర్‌లోని ఉమ్మడి ఎంఎస్‌ 9– గెస్ట్‌ ఇన్‌ లాడ్జి నిర్వాహకులు ఏడు సంవత్సరాలుగా ట్రేడ్‌ లైసెన్సులు నగరపాలక సంస్థకు చెల్లించడం లేదు. దీంతో గురువారం మున్సిపల్‌ పారిశుద్ధ్య సిబ్బంది చెత్త వాహనాన్ని తీసుకొని లాడ్జి ఎదుట నిలిపేశారు. అక్కడే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. ట్రేడ్‌ లైసెన్సుల బకాయిలు రూ.3,31,250 చెల్లించాలని నిర్వాహకులకు తెలియజేశారు. నగరపాలక సంస్థ నుంచి ప్రయోజనాలు పొందుతూ పన్నులు చెల్లించకుండా ఉండటం తగదని పారిశుద్ధ్య పర్యవేక్షకులు నాగరాజు వెల్లడించారు. పారిశుద్ధ్య తనిఖీదారులు అనిల్‌ పాల్గొన్నారు.

నేడు ఖజానా శాఖ

డైరెక్టర్‌ రాక

కర్నూలు (అగ్రికల్చర్‌): ఖజానా, లెక్కల శాఖ డైరెక్టర్‌ మోహన్‌రావు శుక్రవారం కర్నూలుకు రానున్నారు. ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు జిల్లా ట్రెజరీ, సబ్‌ ట్రెజరీల్లో 2024–25లో జరిగిన లావాదేవీలపై ఖజానా శాఖ వార్షిక తనిఖీ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఖజానా శాఖ డైరెక్టర్‌ మోహన్‌రావు కర్నూలుకు రానున్నారు. శుక్రవారం ఉదయం 9:30 గంటలకు కలెక్టరేట్‌లోని స్ట్రాంగ్‌ రూమ్‌ను తనిఖీ చేయనున్నారు. అనంతరం బి.క్యాంప్‌లోని ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి వార్షిక తనిఖీలలో భాగంగా ఇంతవరకు చేపట్టిన తనిఖీలను పరిశీలిస్తారు.

శ్రీమఠంలో భక్తుల సందడి 1
1/1

శ్రీమఠంలో భక్తుల సందడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement